Akhanda 2 Teaser: అఖండ 2 టీజర్ రిలీజ్.. సీన్లు అదిరిపోయాయ్, గూస్ బంప్స్ అంతే..!

నందమూరి బాలకృష్ణ- మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న కొత్త సినిమా “అఖండ 2”. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన “అఖండ” సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు.

రేపు అనగా జూన్ 10 బాలకృష్ణ పుట్టిన రోజు కావడంతో ముందుగానే ఈ టీజర్ వదిలి నందమూరి అభిమానులకు కిక్కిచ్చారు మేకర్స్. ఈ వీడియోలో గూస్ బంప్స్ తెప్పించే సీన్లు ఉన్నాయి. తమన్ తన సంగీతంతో హోరెత్తించడానికి స్పష్టమవుతోంది. ఈ వీడియో చూస్తుంటే ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే.. ముందు ముందు అప్ డేట్ల హవా మామూలుగా ఉండదని అర్థమవుతోంది. విడుదల చేసిన కాసేపట్లోనే ఈ టీజర్ వైరల్ గా మారింది.

“అఖండ 2” మేకింగ్ విషయంలో మేకర్స్ ఎక్కడా రాజీ పడటం లేదని, భారీ బడ్జెట్‌తో టెక్నికల్‌గా, విజువల్‌గా అన్ని విధాలుగా ఈ సినిమాను గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారని తెలియడంతో ఈ సినిమాపై ఓ రేంజ్ హైప్ నెలకొంది. మాస్ యాక్షన్, పవర్‌ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాలో హైలైట్ గా నిలుస్తాయట. 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ మాస్ ఎంటర్‌టైనర్‌ను సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *