నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) మరో మాస్ టైటిల్ మూవీతో వస్తున్నారు. బాబీ దర్శకత్వంలో(Directed by Bobby) బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘NBK 109’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫాస్ట్‌గా సాగుతోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్, ప్రమోషనల్ వీడియో(Poster, Promotional Video)లు భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. షూటింగ్ క్లైమాక్స్ చేరడంతో బాలయ్య ఫ్యాన్స్ ఈ మూవీ అప్డేట్ గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. దీంతో మూవీ టీమ్ ఓ స్పెషల్ అనౌన్స్ మెంట్(Special announcement) చేసింది.
బాలయ్య సరసన ముగ్గురు హీరోయిన్లు
ఇదిలా ఉండగా బాలయ్య నెక్ట్స్ మూవీ టైటిల్ రివీల్ చేశారు మేకర్స్. స్టోరీ, బాలయ్య గెటప్‌కు సెట్ అయ్యేలా ఈ మూవీకి ‘డాకు మహారాజ్(Daku Maharaj)’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు మూవీ టీమ్ సైతం టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తూ టీజర్(Teaser) రిలీజ్ చేసింది. కాగా ఈ మూవీని నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాబీ డియోల్(Bobby Deol) విలన్‌గా కనిపించనుండగా.. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela), తెలుగమ్మాయి చాందినీ చౌదరి ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రానుంది.
టాక్ షోతో దుమ్మురేపుతున్నారు
కాగా బాలయ్య ప్రస్తుతం సినీ లైఫ్‌లో, అటు పొలిటికల్ లైఫ్(Political Life)లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే వరుస హిట్లతో ఊపు మీదున్న బాలయ్య తన లేటెస్ట్ మూవీ(Latest Movie)పై ఫోకస్ చేశారు. గతేడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి, దసరాకు భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల అన్‌స్టాపబుల్ సీజన్ 4(Unstoppable Season 4) షోతో అలరిస్తున్నారు.






