Balakrishna: ఇదేందిరా మావా.. బాలకృష్ణకు ఇన్ని బిరుదులు ఉన్నాయా..? చూస్తే షాకవుతారు

సినీ దిగ్గజం నందమూరి తారకరామారావు వారసుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ(Balakrishna), తన ప్రత్యేకమైన నటనతో తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. పౌరాణికం నుంచి చారిత్రకం, జానపదం నుంచి మాస్ యాక్షన్ వరకు అన్నిరకాల పాత్రల్లో తన సత్తా చాటారు. తన తరం హీరోల్లో అన్ని జానర్లలో సినిమాలు చేసిన హీరో బాలయ్యే అని అభిమానులు గర్వంగా చెబుతుంటారు. అందుకే అభిమానులు ఆయన్ను ప్రేమగా ‘నటసింహ’ అని పిలుస్తుంటారు. అయితే ఈ టైటిల్ ముందు బాలయ్యకు మరోలా పిలిచేవారు.

‘యువ కిశోరం’ నుంచి ‘గాడ్ ఆఫ్ మాసెస్’ వరకు…
బాలకృష్ణ కెరీర్ ప్రారంభ దశలో ఆయనను ‘యువ కిశోరం’ అనే బిరుదుతో పిలిచేవారు. ‘లారీ డ్రైవర్’ వరకు ఈ టైటిల్ వినిపించేది. మధ్యలో వచ్చిన ‘నిప్పులాంటి మనిషి’ సినిమాకైతే స్పెషల్‌గా ‘రైజింగ్ స్టార్ యువ కిశోరం’ అని ట్యాగ్ వేశారు.

ఆ తర్వాత అభిమానులు బాలయ్యను ‘యువరత్న’ అని ముద్దుగా పిలవడం మొదలుపెట్టారు. ఈ బిరుదు ‘నరసింహ నాయుడు’ సినిమా వరకూ కొనసాగింది. అంతే కాక, ‘యువరత్న రాణా’ అనే టైటిల్‌తో ఓ సినిమా కూడా చేశారు. యువకుడిగా, ఉత్సాహంగా సినిమాలు చేస్తున్న సమయంలో ‘యువరత్న’ ట్యాగ్ బాలయ్యకు బాగా సరిపోయింది.

‘నటసింహ’ బిరుదు:
కాలక్రమేణా నటనలో మరింత పక్కదిద్దుకొని, మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే పాత్రలతో బాలయ్య దూసుకెళ్లారు. ఈ సమయంలో ఆయనకు ‘నటసింహ’ అనే ట్యాగ్ ఫిక్స్ అయ్యింది. ‘పల్నాటి బ్రహ్మనాయుడు’ సినిమా నుంచే ఈ బిరుదు ఎక్కువగా వినిపించడం మొదలైంది. పౌరాణిక, చారిత్రక పాత్రల్లో బాలయ్య హావభావాలు, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీన్లు.. ‘నటసింహం’ అనే బిరుదుకు న్యాయం చేశాయి. ‘అఖండ’ వరకు ఈ ట్యాగ్ టైటిల్ కార్డుల్లో నిత్యం కనిపించింది.

‘గాడ్ ఆఫ్ మాసెస్’:
ఇటీవల కాలంలో బాలయ్య పేరు ముందు ‘గాడ్ ఆఫ్ మాసెస్’ అనే ట్యాగ్ వినిపిస్తోంది. మాస్ ఆడియన్స్‌లో బాలయ్యకు ఉన్న క్రేజ్ చూసి ఫ్యాన్స్ ఈ బిరుదుని ఫిక్స్ చేసినట్టు చెప్పొచ్చు. పాన్ ఇండియా స్థాయిలో అభిమానుల మద్దతుతో ఈ ట్యాగ్ కూడా ఇప్పుడు బలంగా నిలుస్తోంది.

ఇంకా కొన్ని ఇంట్రస్టింగ్ టైటిల్స్:
ఇవే కాకుండా బాలయ్య కెరీర్‌లో ట్యాగ్ లేని సినిమాలు కూడా ఉన్నాయి. ‘సీతారామ కళ్యాణం’, ‘సాహసమే జీవితం’, ‘టాప్ హీరో’ వంటి చిత్రాలు వాటిలో కొన్ని. కానీ మరో విశేషం ఏమిటంటే, ‘క్రిష్ణబాబు’ అనే సినిమాలో ‘యుగాస్టార్’ అనే ట్యాగ్ వేశారు. అప్పట్లో ఇది ‘మెగాస్టార్’ చిరంజీవికి పోటీగా ఉద్దేశించి పెట్టారని గాసిప్స్ చక్కర్లు కొట్టాయి. అయితే 1999లో వచ్చిన ఆ సినిమా ఫ్లాప్ కావడంతో, ఆ బిరుదు మళ్లీ వినిపించలేదు.

బిరుదులు మారినా.. బాలయ్య క్రేజ్ మాత్రం అలాగే:
ఇలా ‘యువ కిశోరం’ నుంచి ‘గాడ్ ఆఫ్ మాసెస్’ వరకు ఎన్నో బిరుదులు మారినా, బాలకృష్ణ ఫాలోయింగ్ మాత్రం రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉంది. ఏ ట్యాగ్ వచ్చినా, పోయినా… అభిమానుల హృదయాల్లో ‘జై బాలయ్య’ అనే నినాదం మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది!

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *