
Mana Enadu : నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ప్రేక్షకుల ఎదురుచూపునకు ఇటీవలే తెరపడిన విషయం తెలిసిందే. ‘హను-మాన్ (Hanu-Man)’ ఫేం ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్ అయింది. పూజా కార్యక్రమం కూడా జరిగింది. అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. ఇక షూటింగ్ కు ముహూర్తం కూడా ఖరారు చేశారు. సరిగ్గా షూటింగ్ ప్రారంభం రోజే సినిమా ఆగిపోయింది. అయితే మోక్షజ్ఞ (Mokshagna Teja) హెల్త్ బాలేకపోవడం వల్లే షూటింగ్ వాయిదా పడిందని బాలయ్య చెప్పినా.. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే ఆగిపోయినట్లు టాక్ వినిపిస్తోంది.
మోక్షజ్ఞ కోసం బడా డైరెక్టర్లు
ఇక ప్రశాంత్ వర్మ (Prashant Varma) సినిమాతో ఎంట్రీ వాయిదా పడటంతో బాలయ్య తన కుమారుడి కోసం మరో ఇద్దరు సక్సెస్ ఫుల్ డైరెక్టర్లను లైన్ లో పెట్టాడనే టాక్ వినిపిస్తోంది. వారిలో ఒకరు కల్కితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నాగ్ అశ్విన్ (Nag Ashwin) అయితే మరొకరు ‘లక్కీ భాస్కర్’ సక్సెస్ జోష్ లో ఉన్న వెంకీ అట్లూరి (Venky Atluri). ఈ ఇద్దరిలో ఎవరో ఒకరితో మోక్షజ్ఞ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నాడట బాలయ్య. అయితే నాగ్ అశ్విన్ ప్రస్తుతం కల్కి-2 పనుల్లో బిజీగా ఉన్నాడు. 2025లో ఈ చిత్రం పట్టాలెక్కనుంది. ఈ సినిమా కంప్లీట్ అయ్యే వరకు నాగ్.. మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా లేడు.
ఆదిత్య 999లో మోక్షజ్ఞ
మరోవైపు ‘లక్కీ భాస్కర్ (Lucky Bhaskar)’ సినిమాతో ఇటీవలే హిట్ కొట్టాడు వెంకీ అట్లూరి. ప్రస్తుతం అతడు మరే ప్రాజెక్టును అనౌన్స్ చేయలేదు. ఒకవేళ నాగ్ అశ్విన్ ‘కల్కి-2 (Kalki 2)’ కంటే ముందుగా మోక్షజ్ఞను ఇంట్రడ్యూస్ చేసే బాధ్యత తీసుకునే అవకాశం కూడా లేకపోలేదనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ‘ఆదిత్య 369’ సీక్వెల్ గా ‘ఆదిత్య 999’ మూవీ కూడా మోక్షజ్ఞతో చేయాలని బాలకృష్ణ అనుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఆదిత్య 999 సినిమా కచ్చితంగా ఉంటుంది కానీ.. ఎప్పుడు షురూ అవుతుందో మాత్రం క్లారిటీ లేదు.
మరో రెండేళ్లు వేచి చూడాల్సిందేనా
ఒకవేళ ప్రశాంత్ వర్మతో సినిమా క్యాన్సిల్ అయితే మాత్రం మోక్షజ్ఞ డెబ్యూ (Mokshagna Debut) కోసం మరో రెండేళ్లు కచ్చితంగా ఎదురు చూడాల్సిందేనని సినీ వర్గాల్లో టాక్. అదే జరిగితే మోక్షజ్ఞను ఇంట్రడ్యూస్ చేసే బాధ్యత వెంకీ అట్లూరికి అప్పజెప్పే అవకాశం ఉందని సమాచారం. అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. మొత్తానికి నందమూరి బాలకృష్ణ వారసుడిని తెరపై చూసేందుకు మరికొంత కాలం అభిమానులు వేచి చూడక తప్పదు.