నేచురల్ స్టార్ నాని(Nani), శైలేశ్ కొలను(Sailesh Kolanu) కాంబినేషన్‌లో ‘హిట్ 3(HIT3)’ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మేడే కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. నాని గత సినిమాలతో పోల్చితే ఇందులో రక్త పాతం, హింస ఎక్కువైందని విమర్శలు వచ్చినా ఆడియెన్స్ కు మాత్రం ‘హిట్ 3’ చిత్రం మాంచి కిక్ ఇచ్చింది. టాక్‌తో సంబంధం లేకుండా హిట్ 3 సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి. రూ. 100 కోట్ల మార్క్‌ను అవలీలగా దాటేసింది.
మే 29 నుంచి..
ఇక, ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న వారికి చిత్ర బృందం తీపి కబురు చెప్పింది. ‘హిట్ 3’ రిలీజ్ అయిన నాలుగు వారాలకు ఓటీటీలో రాబోతోంది. మే 29 నుంచి ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు తెలియజేశారు. కాగా, ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా… నాని సరసన హీరోయిన్‌గా కన్నడ భామ, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి నటించారు. యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు.
And here’s the official release date for @NameisNani’s #HIT3
Coming to @NetflixIndia on Thursday, May 29, 2025 pic.twitter.com/ocdjsOLO17
— BINGED (@Binged_) May 24, 2025






