
ప్రస్తుతం టాలీవుడ్(Tollywood)లో నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) హవా నడుస్తోంది. ఓవైపు హీరోగా రాణిస్తూనే.. మరోవైపు నిర్మాతగా అదరగొడుతున్నారు. ఇక ఇప్పటి వరకూ క్లాస్ కంటెంట్ ఉన్న సినిమాల్లోనే కనిపించిన నాని.. ఇటీవల వచ్చిన హిట్-3(HIT3) మూవీతో తనలోని మాస్ యాక్షన్‌ను ప్రేక్షకులకు చూపించాడు. దీంతో అతడి తర్వాత ప్రాజెక్టులపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే నాని, శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) కాంబోలో ప్యారడైజ్(Paradise) మూవీ రాబోతుంది. ఈ మూవీ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన ఫస్ట్ స్టేట్మెంట్ వీడియోనే గూస్‌బంప్స్ తెప్పింది. దీంతో నాని మాస్ విధ్వంసం ఎలా ఉండబోతుందో ఫ్యాన్స్‌కు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది.
ఆడియన్స్‌కి గూస్‌బంప్స్ పక్కా..
హిట్-3లో అర్జున్ సర్కార్(Arjun Sarkar)గా మరోసారి నాని అదరగొట్టాడు. ఇక నెక్స్ట్ రాబోతున్న ప్యారడైజ్ సినిమాతో నాని మరోసారి తన మాస్ అప్పీల్‌తో ఆడియన్స్‌కి మంచి ఫీస్ట్ అందించాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే నాని ప్యారడైజ్ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్(Action episodes) మీద స్పెషల్ ఫోకస్ పెట్టాడని తెలుస్తుంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ అన్నీ కూడా ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అటు మేకర్స్ కూడా స్పెషల్‌గా సీన్స్ డిజైన్ చేస్తున్నారట. దీంతో తప్పకుండా ఈ యాక్షన్ సీన్స్ ఆడియన్స్‌కి గూస్‌బంప్స్ పక్కా అంటున్నారు మేకర్స్.
త్వరలోనే మరో అప్డేట్..
మరోవైపు నాని ప్యారడైజ్ కాస్టింగ్ విషయంలో కూడా క్లారిటీ వచ్చేసిందట. త్వరలోనే మరో అప్డేట్‌తో సినిమా ఫుల్ కాస్ట్ అండ్ క్రూ వెళ్లడిస్తారని తెలుస్తుంది. ఇక ఈ మూవీకి అనిరుధ్(Anirudh) మ్యూజిక్ అందిస్తుండగా.. SLV సినిమాస్ బ్యానర్‌పై చెరుకూరి సుధారక్ నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో నాని సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janvi Kapoor) లేదా సోనాలి కులకర్ణి నటించే ఛాన్సుంది. కాగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ప్యారడైజ్ అనౌన్స్ చేయడమే ఆలస్యం మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఆఫర్ అందుకోవడం గమనార్హం.