
మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ కలిసి నటించిన సినిమా భైవరం (Bhairavam) ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం సాయంత్రం ఏపీలోని ఏలూరులో ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం నిర్వహించారు. నటీనటులు, చిత్ర బృందంతో కలిసి పాల్గొన్న మంచు మనోజ్ (Manchu Manoj) మనోజ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవల తన కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆయన గుర్తు చేసుకొని మాట్లాడారు. ‘సొంతవాళ్లే దూరం పెట్టే ఈ రోజుల్లో మీరు నన్ను దగ్గర చేసుకొని నాకు ఇంత ప్రేమను పంచుతున్నారు. ఈ మధ్యకాలంలో ఎన్నో జరిగాయి. ఎన్నో చూశాను. కట్టుబట్టలతో రోడ్డు మీదకు తెచ్చారు’ అని అన్నారు.
లవ్ యూ..బాబాయ్
ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ను ఉద్దేశించి సహ నటుడు నారా రోహిత్ (Nara Rohith) సోమవారం ఓ పోస్ట్ పెట్టారు. ఏది ఏమైనా మనోజ్‌కు అండగా ఉంటానన్నారు. ‘భైరవం’ ఈవెంట్‌ను సక్సెస్ చేసిన ఏలూరు ప్రాంత వాసులకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. ‘భైరవం ఈవెంట్‌తో ఏలూరులో నిన్న అద్భుతమైన సాయంత్రాన్ని ఆస్వాదించాం. మా ఈవెంట్‌ను ఎంతో ప్రత్యేకంగా మార్చిన ఏలూరు ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. మంచు మనోజ్ బాబాయ్ ఈ ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచాడు. ఆయన స్పీచ్ ఎంతో పవర్‌ఫుల్, భావోద్వేగంగా, హృదయాన్ని హత్తుకునేలా ఉంది. విషయం ఏదైనా.. నేను నీకు తోడుగా ఉంటాను బాబాయ్. లవ్ యూ’ అని రోహిత్ పేర్కొన్నారు.
Nara Rohith Drops ‘Thank You’ Post For Making Eluru Event A Grand Success#politikosvinodam#nararohith#tollywood#entertainment#movieupdates pic.twitter.com/gIiEGvBcvJ
— Politikos Vinodham (@Politikos_ET) May 19, 2025
ముగ్గురు హీరోల ఆశలు ‘భైరవం’పైనే..
విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన ‘భైరవం’ మూవీ మే 30న ప్రేక్షకుల ముందుకురానుంది. కె.కె.రాధామోహన్ నిర్మించారు. ఆనంది, అదితి శంకర్, దివ్య పిళ్లై కథానాయికలు. కొంతకాలంగా పరాజయాలు చవిచూస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda SRinivas)తోపాటు చాలా రోజుల తర్వాత తెరపైకి వస్తున్న మంచు మనోజ్, నారా రోహిత్ ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.