
నారా రోహిత్(Nara Rohith) నటించిన తాజాగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘సుందరకాండ(Sundarakanda)’. ఇది ఆయన 20వ చిత్రం. నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి(Director Venkatesh Nimmalapudi) రూపొందిస్తున్న ఈ మూవీని సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకలి సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్(Teaser), ఫస్ట్ లుక్ పోస్టర్(First Look Poster), “బహుశా బహుశా” అనే పాట ప్రేక్షకుల్లో సానుకూల స్పందనను రాబట్టాయి. శ్రీదేవి విజయకుమార్(Sridevi Vijayakumar), విర్తి వాఘని(Virti Vaghani) ఫీమేల్ రోల్ పోషిస్తున్న ఈ మూవీ ఆగస్టు 27న వినాయక చవితి(Vinayaka Chavithi) సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేడ్ రాబోతుందని మేకర్స్ ట్వీట్ చేశారు. ఈనెల 27న ప్రమోషనల్ వీడియో(Promotional Video)ను రిలీజ్ చేయనున్నట్లు ఈ మేరకు ప్రకటించారు.
ఐదు నిర్దిష్ట లక్షణాల కోసం వెతుకుతూ..
కాగా ఈ మూవీ లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్‌తో కుటుంబ ప్రేక్షకుల(Family audience)ను ఆకర్షించేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో నారా రోహిత్.. సిద్ధార్థ్(Siddharth) అనే మధ్యవయస్క బ్యాచిలర్ పాత్రలో కనిపిస్తాడు. అతను తన జీవిత భాగస్వామిలో ఐదు నిర్దిష్ట లక్షణాల కోసం వెతుకుతూ ఉంటాడు. ఈ పాత్ర తేలికైన, హాస్యాత్మక కోణంలో చిత్రీకరించారు. ఇది ప్రేక్షకులకు సరదాగా, భావోద్వేగంగా అనిపించే క్షణాలను అందిస్తుంది. సినిమా రెండు విభిన్న దశల్లో రెండు ప్రేమకథలను చూపిస్తుంది. సిద్ధార్థ్ యౌవనంలో శ్రీదేవి విజయకుమార్‌తో, మధ్యవయసులో విర్తి వాఘనితో లవ్ స్టోరీ ఉంటుందని సమాచారం.
యూత్, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా..
ఇక ఈ మూవీలో నరేష్ విజయ కృష్ణ(Naresh Vijaya Krishna), వసుకి ఆనంద్, అభినవ్ గోమఠం వంటి నటులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. లియోన్ జేమ్స్(Leon James) సంగీతం, ప్రదీష్ ఎం వర్మ సినిమాటోగ్రఫీ, రోహన్ చిల్లలే ఎడిటింగ్‌తో సాంకేతికంగా ఈ చిత్రం ఆకర్షణీయంగా ఉంది. నారా రోహిత్ ఈ చిత్రంతో తన కెరీర్‌లో కొత్త ఊపు తెచ్చే ప్రయత్నంలో ఉన్నాడు. ముఖ్యంగా ‘ప్రతినిధి 2’ విఫలమైన తర్వాత. ‘సుందరకాండ’ రామాయణంలోని ఐదవ కాండ నుంచి తీసుకొని మరి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. యూత్, కుటుంబ ప్రేక్షకులకు ఆకట్టుకునే హాస్యం, ప్రేమ, భావోద్వేగాల మిశ్రమంగా ఈ మూవీ రూపొందుతుంది.
https://t.co/gmLeHrnb7E#NaraRohith #Sundarakanda #HBDNaraRohith
Nara Rohith’s Sundarakanda Worldwide Theatrical Release On August 27th 👇🏻
— IndustryHit.Com (@industry_hit) July 25, 2025