
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (International Space Station)లో ఉన్న భారతీయ అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ (Sunita Williams) ఆరోగ్యంపై ఇటీవల ఆందోళన వ్యక్తమైన విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రోనాట్ ఆరోగ్య పరిస్థితిపై నాసా(National Aeronautics and Space Administration) క్లారిటీ ఇచ్చింది. సునీతా విలియమ్స్‌తో సహా వ్యోమగాములందరూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని తెలిపింది. ఇదిలా ఉండగా తాజాగా సునీతా విలియమ్స్, ఆమె సిబ్బంది అంతరిక్షంలోనే క్రిస్మస్ వేడుకలకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు వారు శాంతాక్లాస్ టోపీ ధరించి కనిపించారు. తాజాగా నాసా జాన్సన్స్ స్పేస్ సెంటర్ ఎక్స్ వేదికగా విడుదల చేసిన పోస్టులో ఈ విషయం వెల్లడింది.
ఆస్ట్రోనాట్స్ రాక మరోనెల ఆలస్యం
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, బుష్ విల్మోర్(Sunita Williams, Bush Wilmore) ఈ ఏడాది జూన్ 5న బోయింగ్ స్టార్‌లైన్ స్పేస్‌షిప్(Boeing Starline Spaceship)లో ISSకి వెళ్లారు. ఆ తర్వాత స్టార్‌లైర్‌లో సాంకేతిక లోపం(Technical Issue) తలెత్తింది. దాంతో ఇద్దరు ఆస్ట్రోనాట్స్ తిరి భూమికిపైకి చేరుకోవడంలో ఆలస్యమైంది. ఇద్దరు వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకువచ్చేందుకు నాసా(NASA) ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి 2025లో తిరిగి భూమికి తీసుకురానున్నట్లు పేర్కొంది. కానీ అయితే క్రూ-9 సిబ్బందిని రిలీవ్ చేసేందుకు వెళ్లే క్రూ-10 ప్రయోగం మార్చి కంటే ముందు జరిగే సూచనలు కనిపించడం లేదని తాజాగా నాసా ప్రకటించింది. దీంతో వీరి రాక మరోనెల ఆలస్యం కానుంది.
Another day, another sleigh ⛄️❄️@NASA_Astronauts Don Pettit and Suni Williams pose for a fun holiday season portrait while speaking on a ham radio inside the @Space_Station's Columbus laboratory module. pic.twitter.com/C1PtjkUk7P
— NASA's Johnson Space Center (@NASA_Johnson) December 16, 2024