Mana Enadu: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (International Space Station)లో ఉన్న భారతీయ అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ (Sunita Williams) ఆరోగ్యంపై ఇటీవల ఆందోళన వ్యక్తమైన విషయం తెలిసిందే (Sunita Williams health). రెండు రోజులుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో(Photo)లో సునీత బరువు తగ్గి చాలా అనారోగ్యంగా ఉన్నట్టు కనిపించారు. ఇది చాలా మందికి ఆందోళన కలిగించింది. దీనిపై అమెరికాకు చెందిన డాక్టర్ వినయ్ గుప్తా(Dr. Vinay Gupta) ఆందోళన వ్యక్తం చేశారు. సునీతా పోషకాహార లోపాన్ని(Malnutrition) ఎదుర్కొంటున్నారని అందువల్లే బలహీనంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యలు చేశారు ఇది పెద్ద చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రోనాట్ ఆరోగ్య పరిస్థితిపై నాసా( National Aeronautics and Space Administration) క్లారిటీ ఇచ్చింది.
వ్యోమగాములందరూ సేఫ్
రెండు రోజుల క్రితం అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాముల ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వ్యాఖ్యలను, సునీతా విలియమ్స్ అనారోగ్యంపై వస్తోన్న వార్తలను నాసా(NASA) తాజాగా ఖండించింది. సునీతా విలియమ్స్‌తో సహా వ్యోమగాములందరూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని తెలిపింది. వ్యోమగాములకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు(Medical tests) జరుగుతాయని, ఫ్లైట్ సర్జన్లు(Flight surgeons) పర్యవేక్షిస్తారని తెలిపింది.
వచ్చే ఫిబ్రవరిలో తిరిగి భూమికి
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, బుష్ విల్మోర్(Sunita Williams, Bush Wilmore) ఈ ఏడాది జూన్ 5న బోయింగ్ స్టార్‌లైన్ స్పేస్‌షిప్(Boeing Starline Spaceship)లో ISSకి వెళ్లారు. ఆ తర్వాత స్టార్‌లైర్‌లో సాంకేతిక లోపం(Technical Issue) తలెత్తింది. దాంతో ఇద్దరు ఆస్ట్రోనాట్స్ తిరి భూమికిపైకి చేరుకోవడంలో ఆలస్యమైంది. ఇద్దరు వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకువచ్చేందుకు నాసా ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి 2025లో తిరిగి భూమికి తీసుకురానున్నట్లు పేర్కొంది. దీంతో సునీత అనారోగ్యంపై వస్తోన్న వార్తలు చెక్ పెట్టినట్లైంది.
Sunita Williams went to space on an 8-day mission, but now she has been stuck there for the last 153 days and has become very weak
It has become very difficult for her to come back now pic.twitter.com/JJnELJgKwc
— Kuldeep S Dhillon (@kdeep39) November 8, 2024






