నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ప్రధాన పాత్రలో నటించిన భగవంత్ కేసరి సినిమాకు నేషనల్ అవార్డు(National Award) వరించిన విషయం తెలిసిందే. 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల(71st National Film Awards)ను కేంద్రం శుక్రవారం (ఆగస్టు 1) ప్రకటించింది. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘భగవంత్ కేసరి’ని (Bhagavanth Kesari) అవార్డు వరించింది. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో శ్రీలీల(Sreeleela), కాజల్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషించారు.

నేషనల్ అవార్డు రావడం చాలా సంతోషం
ఈ చిత్రానికి అవార్డు రావడంపై ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu) స్పందించారు. సోషల్ మీడియా(SM) వేదికగా తన ఆనందాన్ని తెలియజేశారు. భగవంత్ కేసరి సినిమాకి జాతీయ అవార్డు రావడం సంతోషకరమైన విషయం. హీరో బాలకృష్ణ, చిత్రబృందానికి శుభాకాంక్షలు అని చంద్రబాబు పేర్కొన్నారు. బాలా మామయ్య సినిమాకు నేషనల్ అవార్డు రావడం చాలా సంతోషం. చిత్ర బృందానికి అభినందనలు అని నారా లోకేష్(Nara Lokesh) ట్వీట్ చేశారు. తెలుగు సినిమాలకు ఏడు జాతీయ చలనచిత్ర అవార్డులు లభించడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) హర్షం వ్యక్తం చేశారు. విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటు తెలుగు సినిమాలకు అవార్డులు రావడంపై విజేతలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అభినందనలు తెలిపారు.
/rtv/media/media_files/2025/08/01/71st-national-film-awards-2025-2025-08-01-18-25-58.jpg)
కాగా ‘బాలకృష్ణ(Balakrishna) భగవంత్ కేసరి ఉత్తమ తెలుగు చిత్రంగా, VFX విభాగం, ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్ విభాగాల్లో హనుమాన్, ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో సాయి రాజేశ్(Baby), ఉత్తమ గీత రచయిత కాసర్ల శ్యామ్ (Balagam), ఉత్తమ బాలనటి సుకృతివేణి బండ్రెడ్డి(గాంధీ తాతచెట్టు) ఎంపికయ్యాయి.






