నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా.. శైలష్ కొలను(Sailesh Kolanu) డైరెక్షన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘హిట్-3 ది థర్డ్ కేస్(HIT: The Third Case)’. పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ చిత్రం ఇవాళ (మే 1) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు మిక్కీజే మేయర్(Mickey J. Meyer) మ్యూజిక్ అందించారు. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్(Teaser), ట్రైలర్(Trailer)లకు సాంగ్స్‌కు మొదటి నుంచే ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ‘అబ్ కీ బార్ అర్జున్ సర్కార్’ అనే సాంగ్ ఊపేసింది. మరి భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ ఫ్యాన్స్‌ను ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందామా..
అర్జున్ సర్కార్ చేసిన నేరంతో
‘కోర్ట్(Court)’ సినిమా బాలేకపోతే నా ‘HIT-3’ సినిమా చూడొద్దు.. ‘హిట్ 3’ సినిమా బాలేకపోతే SSMB మూవీ చూడొద్దు. అని రాజమౌళి(Rajamouli)ని పక్కన పెట్టుకుని మరీ నాని ఇటీవల చేసిన కామెంట్స్ ఇవి. అందుకు తగ్గట్లే హిట్-3లో నాని అదరగొట్టాడు. అర్జున్ సర్కార్(Arjun Sarkar) చేసిన నేరంతో కథ మొదలౌతుంది. అది నేరమా? లేదంటే నేరం చేసిన వాళ్లకి విధించే శిక్షా? అన్న కథాగమనంలో ట్విస్ట్‌లు.. ట్రిగ్గర్ పాయింట్‌లు చాలానే ఉన్నాయి. అర్జున్ సర్కార్ అనే పవర్ ఫుల్ పోలీస్ అధికారి(Powerful Police Officer)గా నానిలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు దర్శకుడు. పగ, ప్రతీకారం కథకి రిలేటబుల్‌గా డీల్ చేస్తూ.. కేసుకి సంబంధించిన ఇంటెన్సిటీ.. ఎంజాయ్ చేసే విధంగానే ఉంటుంది. కానీ.. ఎంత సైకో గ్యాంగ్‌ని అంతం చేయడానికి హీరో కూడా సైకోలని మించిన సైకోగా మారాలనే పాయింట్ ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈ క్రమంలో అతనికొక ప్రియురాలు మృదుల (శ్రీనిధి శెట్టి). ఇంతకీ ఆ సైకో కింగ్ పిన్ ఎవరు? అనేదే మిగతా స్టోరీ.

ఎవరెలా చేశారంటే..
నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతాడు. అర్జున్ సర్కార్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. నిజమైన పోలీసు ఆఫీసర్‌లాగే తెరపై కనిపించాడు. యాక్షన్ సీన్లలో అదరగొట్టేశాడు. శ్రీనిధి శెట్టి అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. కథని మలుపు తిప్పే పాత్ర ఆమెది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. మిక్కీ జే మేయర్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. పెద్దగా ట్విస్టులు లేకపోవడం, ఫస్టాఫ్ కాస్త స్లోగా సాగడం, వయలెన్స్ ఎక్కువగా ఉండటం సినిమాకు మైనస్. ఓవరాల్‌గా తెరపై భయపెట్టే సైకో కిల్లర్ ఈ అర్జున్ సర్కార్.
![]()
రేటింగ్: 3/5






