నేచురల్ స్టార్ నాని(Nani) నటించిన ‘హిట్ 3: ది థర్డ్ కేస్(Hit 3: The Third Case)’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. శైలేష్ కొలను(Director Sailesh Kolanu) డైరెక్షన్లో మే 1న రిలీజైన ఈ క్రైమ్ థ్రిల్లర్ అన్ని ఏరియాల్లో కలెక్షన్లు కొల్లగొడతోంది. విడుదలైన తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ ఇప్పటి వరకూ రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. విడుదలైన రెండు వారాలు పూర్తయినా చాలా థియేటర్లలో హౌస్ ఫుల్ షోలు పడుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

ఓటీటీ రైట్స్ రూ.50 కోట్లు?
ఇక సినిమాను OTTలో ఎప్పుడు చూడొచ్చో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులో భాగంగా, తాజా సమాచారం ప్రకారం, హిట్ 3 సినిమా నెట్ఫ్లిక్స్(Netflix) ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోందట. ఇందుకోసం నెట్ఫ్లిక్స్ దాదాపు రూ.50 కోట్లు చెల్లించినట్టు సమాచారం. థియేటర్ రిలీజ్ తర్వాత ఐదు వారాల వ్యవధిలో ఓటీటీకి వస్తుందనే ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది.
Sarkaar is a cinephile like all of us 😅💥💥
Book your tickets for #HIT3 now!
🎟️ https://t.co/8HrBsV0jIt#BoxOfficeKaSarkaar
Natural Star @NameisNani @KolanuSailesh @SrinidhiShetty7 @komaleeprasad @MickeyJMeyer @SJVarughese @karthikaSriniva @Srinagendra_Art @tprashantii… pic.twitter.com/hkfodJPLve— Wall Poster Cinema (@walpostercinema) May 12, 2025
ఈ లెక్కన చూస్తే, జూన్ తొలి లేదా రెండో వారంలో ‘HIT 3’ ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుంది. కాగా ఈ మూవీలో హీరోయిన్గా కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) నటించగా, సూర్య శ్రీనివాస్, రావు రమేష్, సముద్రఖని, నెపోలియన్, రవీంద్ర విజయ్, ప్రతీక్ బబ్బర్, టిస్కా చోప్రా తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.






