మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ మూవీ తర్వాత అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నారు. అయితే ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్లో అడుగుపెడతానా అని చిరు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. ఆ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పుకొచ్చారు. ‘ఈ కథలోని సీన్స్‌ను అనిల్ వివరిస్తుంటే నవ్వు ఆపుకోలేకపోయాను. ఈ మూవీ సెట్‌లోకి ఎప్పుడు అడుగు పెడతానా.. అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.’ అని చిరంజీవి అన్నారు.
Meeting our gang of #Mega157 🤗
Loved it @anilravipudi, i can imagine how entertaining the shoot is going to be on the sets!
SANKRANTHI 2026 రఫ్ఫాడిద్దాం 😉#ChiruAnil @Shine_Screens @GoldBoxEnt pic.twitter.com/ZKMv76vGfX
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 1, 2025
చిరు-అనిల్ సినిమా అప్డేట్
అయితే ప్రస్తుతం చిరు-అనిల్ సినిమా సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ పని జరుగుతోందట. ఈ పనిమీదే అనిల్ వైజాగ్ వెళ్లారట. సినిమా సెకండాఫ్ లో చిరు పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందట. చిత్తూరు డిక్షన్ తో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో ఈ మెగా హీరో ప్రేక్షకులను అలరించనున్నారట. ఇక తాజాగా ఈ సినిమా గురించి ఓ న్యూస్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఇందులో ఇద్దరు కథానాయికలు నటించబోతున్నారట. వాళ్లెవరంటే.. ?
చిరుతో ఇద్దరు భామలు
చిరంజీవితో కలిసి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ సినిమాల్లో నటించిన లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించబోతున్నారట. ఈ మూవీలో ఫీ మేల్ లీడ్ కోసం నయన్ ను సంప్రదించగా పాత్రకు ఓకే చెప్పిన ఆమె రెమ్యునరేషన్ మాత్రం బాగా డిమాండ్ చేశారట. ఇక ఆమెతో పాటు ఈ సినిమాలో మరో హీరోయిన్ కీలక పాత్రలో నటించనున్నారట. చిరుకు సిస్టర్ పాత్రలో నటి జ్యోతిక(Jyothika)ను తీసుకోవాలని నెటిజన్లు భావిస్తున్నారట. నయన్, జ్యోతిక కలిసి రజనీకాంత్ తో కలిసి చంద్రముఖిలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు ఆ సెంటిమెంట్ చిరుకు కూడా వర్కవుట్ అవుతుందా లేదో చూడాలి.






