
కోలీవుడ్ స్టార్ నటి, లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara)కు సౌత్ ఇండియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ వైపు స్టార్ హీరోల సినిమాలు చేస్తూనే మరో వైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు(Lady oriented Movies) చేస్తోందీ అందాల తార. నయనతారను ‘లేడీ సూపర్ స్టార్(Lady Superstar)’ అని పిలవడానికి కారణం ఆమె పోషించిన పాత్రలే అని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా నయన్‌కు సంబంధించి చాలా రోజులుగా ట్రెండింగ్‌లో ఉన్న వార్త తాజాగా అఫీషియల్‌గా బయటికొచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరోగా తెరకెక్కనున్న ‘Chiru157’ మూవీలో నయనతార కీలక పాత్ర పోషించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు ఓ స్పెషల్ వీడియో(Special Video)ను రిలీజ్ చేశారు.
హలో మాస్టారు..
హీరోయిన్ నయనతార జర్నీలో జాయిన్ అయ్యారంటూ ఓ వీడియోను పంచుకుంది. నయనతార తెలుగులో మాట్లాడటం, చిరంజీవి పాటలు(Songs) వినడం, స్క్రిప్ట్ చదవడం వంటివి వీడియోలో ఉన్నాయి. చివరిలో ‘హలో మాస్టారు.. కెమెరా కొద్దిగా రైట్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా.. 2026 సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం’ అంటూ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Director Anil Ravipudi)తో ఆమె చెప్పిన సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. మరోవైపు టీమ్‌లోకి ఆమెను స్వాగతిస్తూ చిరు సైతం పోస్టు పెట్టారు.
ముచ్చటగా మూడోసారి
కాగా నయనతార, చిరంజీవి గతంలో రెండు సినిమాల్లో నటించారు. సైరా నరసింహారెడ్డి(Syraa Narasimha Reddy)లో ఆమె అతని భార్యగా నటించగా, గాడ్ ఫాదర్(God Father) తెలుగు రీమేక్‌లో ఆమె అతని సోదరిగా కనిపించింది. అన్నీ సరిగ్గా జరిగితే, తాజాగా ముచ్చటగా మూడోసారి ఆమె చిరుతో కలిసి పని చేస్తోంది. నయనతార ఇటీవల కన్నడ స్టార్ యష్ నటించిన టాక్సిక్ చిత్రానికి సంతకం చేసింది. అలాగే, ఆమె తమిళంలో కొన్ని సినిమాలకు సంతకం చేసింది.
#Nayanthara joins the journey of #Mega157 ❤️🔥
Witness her elegance and emotion on the big screen alongside Megastar @KChiruTweets in an @AnilRavipudi Entertainer💥
— https://t.co/sOl9lY6HJ9 #ChiruAnil SANKRANTHI 2026 – రఫ్ఫాడించేద్దాం 🔥 pic.twitter.com/Z5mY0iUCCT
— Suresh PRO (@SureshPRO_) May 17, 2025