Neha Shetty in OG: పవన్‌తో స్టెప్పులేయనున్న డీజే టిల్లు బ్యూటీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Power Star Pawan Kalyan), యంగ్ డైరెక్టర్ సుజిత్ కాంబోలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ఓజీ. ఈ మూవీలో పవన్ సరసన ప్రియాంకా మోహన్ నటిస్తోంది. DVV ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. శ్రియారెడ్డి(Shriya Reddy) కీలక రోల్ పోషిస్తోంది. అలానే జపనీస్‌ నటుడు కజుకి కిటముర(
Kazuki Kitamura) కూడా నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది. ఇంతకీ అదేంటంటే..

స్పెషల్‌ సాంగ్స్‌కు పెరుగుతున్న క్రేజ్

ఓజీ(OG)లో పవన్‌తో కలిసి DJ టిల్లు హీరోయిన్ నేహా శెట్టి(Neha Shetty) ఆడిపాడనుంది. దీంతో రాధిక పాప భలే ఛాన్స్ కొట్టేసిందంటూ Tటౌన్లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. OGలోని ఓ స్పెషల్‌ సాంగ్(Special Song)లో ఈ ముద్దుగుమ్మ స్టెప్పులేయనుంది. ఇప్పటికే థాయ్‌లాండ్‌(Thailand)లో ఈ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. దాదాపు 3 రోజుల నుంచి షూటింగ్ జరుగుతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. నేహా శెట్టి కూడా తాను షూటింగ్‌లో పాల్గొన్నట్లు ఓ ఫొటో సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేసింది. అయితే అది ఓజీ కోసమే అనేది మాత్రం చెప్పలేదు. దీనిపై మేకర్స్ స్పందించాల్సి ఉంది. కాగా ఈ మధ్య తెలుగు సినిమాల్లో ఐటెం సాంగ్స్‌కి బాగా పాపులారిటీ పెరిగడంతోనే OGలో స్పెషల్ సాంగ్‌కు ప్లాన్ చేసినట్లు సమాచారం.

పాలిటిక్స్‌లో పవన్ బిజీబిజీ

ఇదిలా ఉండగా ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో(Politics) బిజీబిజీగా గడుపుతున్నాడు. మరోవైపు అవకాశం దొరికినప్పుడల్లా పెండింగ్ మూవీలను పూర్తి చేస్తున్నాడు పవర్ స్టార్. ప్రజెంట్ ‘హరిహర వీరమల్లు(Harihara Veeramallu)’ సినిమాని ఫస్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు పవన్. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 28న విడుదల కావాల్సి ఉంది. అటు పవన్ మరో పెండింగ్ మూవీ ‘OG’ని కూడా త్వరగానే పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఈ సినిమా కోసం ఇతర పాత్రల షూటింగ్ పూర్తి చేసి తర్వాత పవన్‌ను రంగంలోకి దింపాలని డైరెక్టర్ సుజిత్(Director Sujith) భావిస్తున్నట్లు సినీ వర్గాలు అంటున్నాయి. మరి పవన్ పెండింగ్ మూవీలు ఎప్పటికి పూర్తి అవుతాయోనన్న దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *