ManaEnadu: ప్రజెంట్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించి విప్లవాత్మక మార్పులు వచ్చాయి. మనీ ట్రాన్స్‌ఫర్లు, పేమెంట్లు, ఇన్వెస్ట్‌మెంట్లు(Money Transfers, Payments, Investments) క్షణాల్లో చేసేస్తున్నాం. ఆన్‌లైన్ బ్యాంకింగ్(Online banking), స్మార్ట్‌ఫోన్, మొబైల్ డేటా ఉంటే చాలు అరచేతిలోని అన్నిపనులు అయిపోతున్నాయ్. కానీ ఫిజికల్ క్యాష్ డ్రా చేయాలంటే మాత్రం ATMకి వెళ్లాల్సిందే. డెబిట్ కార్డులు ఉండాల్సిందే. అయితే ఇప్పుడా టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే డెబిట్ కార్డు(Debit card) లేకపోయినా UPI యాప్‌ను యూస్ చేసి క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
యూపీఐ ఏటీఎం అంటే ఏంటంటే..
UPI ATM వినియోగదారులకు ఫిజికల్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ల(Debit or Credit Cards) అవసరం లేకుండా క్యాష్ విత్‌డ్రా(Cash Withdraw) చేసుకునే సదుపాయం అందిస్తుంది. UPI AAP ఉపయోగించి మల్టిపుల్ అకౌంట్స్ నుంచి క్యాష్ డ్రా చేసుకోవచ్చు. ATMకు వెళ్లిన వెంటనే క్యాష్ విత్‌డ్రా ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. దీని తర్వాత, మీకు స్క్రీన్‌పై యూపీఐ ఆప్షన్ డిస్ ప్లే అవుతుంది. దానిపై క్లిక్ చేసిన తర్వాత కింద QR కోడ్ కనిపిస్తుంది. తర్వాత మీ మొబైల్‌లో ఏదైనా UPI యాప్‌ను ఓపెన్ చేయండి, ATMలోని QR కోడ్‌ను SCAN చేయండి. దీని తర్వాత, మీరు విత్‌డ్రా చేయాలనుకుంటున్న అమౌంట్ ఎంటర్ చేయాలి. ఒకసారి రూ.5000 వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు UPI PIN ఎంటర్ చేసి, కంటిన్యూపై క్లిక్ చేయాలి. క్యాష్ విత్‌డ్రా ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది.
ఆర్థిక మోసాలు భారీగా తగ్గుతాయి
యూపీఐ ఏటీఎం (UPI ATM) ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే.. ఫిజికల్ కార్డ్ వినియోగించకపోతే, పిన్, కార్డ్ నంబర్ సహా కార్డ్ సమాచారాన్ని సేకరించడం ఇతరులకు సాధ్యం కాదు. ఆర్థిక మోసాలు భారీగా తగ్గుతాయి. మీకు అకౌంట్ ఉన్న బ్యాంకు అప్లికేషన్ ద్వారా కూడా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. దీని కోసం, మీ మొబైల్ నంబర్ తప్పనిసరిగా మీ బ్యాంక్ అకౌంట్(Bank account)తో లింక్ అయి ఉండాలి. మీకు బ్యాంక్ యాప్‌లో ఏటీఎం క్యాష్ విత్‌డ్రా ఆప్షన్ కనిపిస్తుంది. ఆ స్టెప్స్ ఫాలో అయితే, కార్డు అవసరం లేకుండానే మనీ విత్‌డ్రా చేసుకోవచ్చు.








