
ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్(Renault), తన బడ్జెట్ ఫ్రెండ్లీ 7-సీటర్ MPV అయిన ట్రైబర్ కొత్త ఫేస్‌లిఫ్ట్(Facelift) మోడల్‌ను భారత్‌లో విడుదల(Indian Market Release) చేసింది. దాదాపు 6 ఏళ్ల తర్వాత ఈ కారుకు పూర్తి డిజైన్, ఫీచర్ల అప్‌డేట్ ఇచ్చారు. కొత్త ట్రైబర్ ధరలు ₹6.29 లక్షల నుండి ₹8.64 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి.
ఈ మోడల్‌ను కంపెనీ నాలుగు వేరియంట్లలో అందిస్తోంది. ఆథెంటిక్, ఎవల్యూషన్, టెక్నో, ఎమోషన్. బేస్ మోడల్ ధర ₹6.29 లక్షలు కాగా, టాప్ మోడల్ ధర ₹8.64 లక్షలు. పాత మోడల్‌తో పోలిస్తే 14,000 నుంచి 41,000 వరకు ధరలు పెరిగింది.
కాస్మెటిక్ మార్పులు:
కొత్త ఫ్రంట్ గ్రిల్, అల్లాయ్ వీల్స్, స్మోక్ LED టెయిల్ లైట్స్, బ్లాక్ డోర్ హ్యాండిల్స్‌తో డిజైన్ మరింత ఆకర్షణీయంగా మారింది. కొత్త లోగో, స్టైలిష్ బంపర్, DRLs అన్నీ ట్రైబర్‌కు ఫ్రెష్ లుక్‌ను తీసుకువచ్చాయి.
అధునాతన ఇంటీరియర్:
ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ 8-అంగుళాల టచ్‌స్క్రీన్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే మద్దతుతో పాటు కొత్త స్టీరింగ్ వీల్, బ్లాక్-గ్రే టోన్ ఇంటీరియర్ ఇవ్వడం విశేషం.
భద్రత & పనితీరు
అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్, ABS, EBD, ఆటో హెడ్‌లైట్స్, ఆటో వైపర్లు, క్రూయిజ్ కంట్రోల్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. మునుపటిలాగే 1-లీటర్, త్రీ సిలిండర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ (72 hp పవర్, 96 Nm టార్క్) అందుబాటులో ఉంది,