Mana Enadu : హైదరాబాద్ మహానగరం కొత్త ఏడాదికి (New Year 2025) సరికొత్తగా వెల్ కమ్ చెప్పేందుకు రెడీ అవుతోంది. కొందరు కుటుంబ సభ్యులతో న్యూ ఇయర్ ను ఆహ్వానిస్తే.. మరికొందరు తమ స్నేహితులతో సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకొందరు అందరితో కలిసి ఈవెంట్లకు అటెండ్ అయ్యి అక్కడ కొత్త ఏడాదిని ఆహ్వానిస్తారు. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది ఈవెంట్ నిర్వాహకులు సరికొత్త థీమ్ లతో న్యూ ఇయర్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తారు.
సరికొత్తగా 2025కి వెల్ కమ్
ఫేమస్ సింగర్స్, సినీ తారలు, గ్లామరస్ హీరోయిన్లు.. అతిథులుగా న్యూ ఇయర్ ఈవెంట్స్ (New Year Event in Hyderabad) నిర్వహిస్తారు. డీజేలు, ఉర్రూతలూగించే మ్యూజిక్ తో ఆడియెన్స్ ను అలరిస్తారు. ఇక డిసెంబరు 31వ తేదీన 2024కి ముగింపు పలుకుతూ 2025 సరికొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికేందుకు భారీగా ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారు. ఇక చాలా మంది తమ స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులతో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునేందుకు గెస్ట్ హౌస్‌లు, రిసార్టులు బుక్ చేసుకున్నారు.
ఫిలిం సిటీలో అదిరిపోయే ఈవెంట్
ఇక పార్కులు, క్లబ్‌లు, పబ్‌లు, స్టార్ హోటల్స్, శివార్లలోని కన్వెన్షన్ హాళ్లు న్యూ ఇయర్ వేడుకలకు రెడీ అవుతున్నాయి. గేటెడ్ కమ్యూనిటీల్లోనూ భారీ ఎత్తున వేడుకలకు రంగం సిద్ధం చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామోజీ ఫిల్మ్ సిటీ (Ramoji Film City)లో 31వ తేదీన రాత్రి వేడుకలకు ముస్తాబైంది. ఈ వేడుకల్లో ది ఫేమస్ డీజే చేతస్ లైవ్ మ్యూజిక్ షో ఏర్పాటు చేశారు. స్టాండప్ కామెడీ, అక్రోబాటిక్ స్టంట్స్, గేమ్స్ కూడా అరేంజ్ చేశారు.
నోవాటెల్‌లో న్యూ ఇయర్ ఈవెంట్
ఇక నోవాటెల్ హోటల్ (Novatel)లో న్యూ ఇయర్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. విద్యుత్తు ధగధగల నడుమ, లైవ్ మ్యూజిక్, డీజే హోరులో వేడుకలు ఏర్పాటు చేశారు. బాలీవుడ్, టాలీవుడ్, ఈడీఎం, రాక్ మ్యూజిక్‌తో ఆడియెన్స్ ను అలరించేందుకు ఆల్వేస్ ఈవెంట్స్ సంస్థ రెడీ అయింది. మొత్తానికి భారీ ఎత్తున ఈ ఏడాది న్యూ ఇయర్ ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకల్లో ఎలాంటి అపశ్రుతి జరగకుండా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. న్యూ ఇయర్ వేళ నగరంలో పలు విషయాల్లో ఆంక్షలు విధించారు.







