నూతన సంవత్సరం (New Year) సందర్భంగా డిసెంబరు 31వ తేదీన తెలంగాణలో మద్యం ఏరులై పారింది. ఈ ఏడాది మందుబాబులు లీటర్లకు లీటర్లు మద్యం (Liquor Sales) తాగేశారు. దాదాపుగా ప్రతి రోజు రూ.200 కోట్ల విలువైన మద్యం సరఫరా అయినట్లు సమాచారం. ఒక్క డిసెంబరు నెలలో రూ.3,805 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఇందులో 38.07 లక్షల కేసుల లిక్కర్, 45.09 లక్షల కేసుల బీర్లు విక్రయించారు.
భారీగా మద్యం విక్రయం
న్యూయర్ వేడుకల్లో భారీగా మద్యం విక్రయం (Liquor Sales in Telangana) జరిగినట్లు సమాచారం. డిసెంబర్ నెల 22వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పది రోజుల్లో భారీగా మద్యం సరఫరా అయినట్లు అధికారులు తెలిపారు. వారం రోజుల్లో ఏకంగా దాదాపు రూ.1700 కోట్లు విలువైన మద్యం డిపోల నుంచి అమ్ముడుపోయినట్లు వెల్లడించారు.
వారం రోజుల్లో ఎంత మద్యం అమ్ముడుపోయిందంటే..
- 23వ తేదీన – రూ.193 కోట్లు
- 24వ తేదీన – రూ.197 కోట్లు
- 26వ తేదీన – రూ.192 కోట్లు
- 27వ తేదీన – రూ.187 కోట్లు
- 28వ తేదీన – రూ.191 కోట్లు
- 30వ తేదీన – రూ. 402 కోట్లు
- 31వ తేదీన – రూ.282 కోట్లు
గత ఏడాది ఇదే 22వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరిగిన అమ్మకాలను పరిశీలిస్తే రూ.1510 కోట్లు విలువ చేసే మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రెండు వందల కోట్ల విలువైన మద్యం అదనంగా అమ్ముడుపోయినట్లు గణాంకాలు స్పష్టం చేశాయి.







