మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరం(New Year)లోకి అడుగుపెట్టబోతున్నాం. ఇందుకోసం యావత్తు ప్రపంచం మొత్తం ముస్తాబవుతోంది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు 2024 సంవత్సరానికి వీడ్కోలు(Goodbye) పలికి.. నూతన సంవత్సరం 2025కు ఘన స్వాగతం(Welcome) పలికేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్(New Year’s Eve Celebrations)కు ఈవెంట్ ఆర్గనైజర్లు, హోటళ్లు, పబ్(Pubs)లు సైతం ప్రజల్లో మరింత జోష్ నింపేలా ఏర్పాట్లు చేసేశాయి. ముఖ్యంగా మద్యం ప్రియులకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వెరీ స్పెషల్. తాగిన తర్వాత కొందరు రోడ్లపైకి వచ్చి న్యూసెన్స్ చేయడం, లేదా సొంత వాహనాలను నడుపుకుంటూ వెళ్లి ప్రమాదాలకు కారకులు అవడం వంటివి ఏటా జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరు పోలీసులు(Bengaluru Police) ఓ కొత్త రూల్(Rule) పెట్టారు. ఇంతకీ అదేంటంటే..
జరిమానాతోపాటు జైలు
న్యూ ఇయర్ పేరిట న్యూసెన్స్(Nuisance) చేస్తే తాట తీస్తామంటున్నారు బెంగళూరు పోలీసులు. పైగా కొత్త సంవత్సర వేడుకలలో బహిరంగ ప్రదేశాల్లో ఈలలు వేయడం, మాస్కులు(Masks) ధరించడం తప్పనిసరి చేశారు. అంతేకాదు.. మహిళలను వేధించినా.. మెట్రో రైళ్ల(Metro Trains)లో అసభ్యకరంగా ప్రవర్తించినా రూ.500 జరిమానాతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా న్యూఇయర్ సెలబ్రేషన్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే MGరోడ్డులో 2000 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ ఏర్పాట్లు షురూ..
ఇటు న్యూఇయర్ వేడుకలకు తెలుగు రాష్ట్రాలు(Telugu States) సిద్ధమయ్యాయి. ఇప్పటికే ప్రధాన ఏరియాలు, నగరాలు, పట్టణాలు, శివారు ప్రాంతాల్లో పోలీసులు సోదాలు ప్రారంభించారు. అనుమతులు లేకుండా ఈవెంట్లు(Events) నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫాంహౌస్‌లు, రిసార్ట్స్‌లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పార్టీల్లో డ్రగ్స్(Drugs) దొరికితే లైసెన్సులు రద్దు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని AP, తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు.






