హనుమాన్ తరహాలో మరో పవర్‌ఫుల్ చిత్రం.. టీజర్ అద్భుతం!

రవి కిరణ్(Ravi Kiran) హీరోగా, రోహిత్ కొల్లి(Rohith Kolli) దర్శకత్వంలో రూపొందుతున్న మైథలాజికల్ ఫాంటసీ(Mythological Epic ) మూవీ ‘గదాధారి హనుమాన్’(Gadadhari Hanuman ) టీజర్(Teaser Released) విడుదలయ్యింది. విరభ్ స్టూడియో బ్యానర్‌పై రేణుకా ప్రసాద్, బసవరాజ్ హురకడ్లి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతోంది. టీజర్ విడుదల కార్యక్రమానికి ప్రముఖులు సి. కళ్యాణ్, రాజ్ కందుకూరి, డైరెక్టర్ సముద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ.. “హనుమాన్ సినిమాను నేనే ప్రారంభించాను. ప్రశాంత్ వర్మకు నాతో సినిమాలపై ప్రత్యేక అనుబంధం ఉంది. ‘హనుమాన్’ పెద్ద విజయాన్ని అందుకున్నట్టు, ఈ ‘గదాధారి హనుమాన్’ కూడా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. టీజర్ అద్భుతంగా ఉంది,” అని పేర్కొన్నారు.

రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. “ఈ టైటిల్ చాలా బాగుంది. రవి కిరణ్ కథ చెప్పినప్పుడే నాకు క్లైమాక్స్ అదిరిపోతుందన్న నమ్మకం కలిగింది. కంటెంట్ ఉంటే సినిమాలు పెద్దవా, చిన్నవా అనే తేడా మిగిలిన ఆడియన్స్ చూడటం లేదు. ఇది బ్లాక్‌బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది అని” అన్నారు.

దర్శకుడు రోహిత్ తన మూడేళ్ల ప్రయాణాన్ని గుర్తు చేస్తూ.. “మొదట్లో చిన్న కాన్సెప్ట్‌గా మొదలుపెట్టాం. కానీ రవి కిరణ్ జాయిన్ కావడంతో ప్రాజెక్ట్ స్థాయే మారిపోయింది. పాన్ ఇండియా మూవీగా రూపొందించాం,” అన్నారు.

హీరో రవి కిరణ్ మాట్లాడుతూ.. “మా ప్రాజెక్ట్‌కు హనుమంతుడి ఆశీస్సులు ఉండటంతో ఈ స్థాయికి వచ్చింది. చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా ఉంటుంది. చిరంజీవి గారి ఆశీర్వాదం కూడా ఉంటుందని ఆశిస్తున్నాను,” అన్నారు. టీజర్‌పై స్పందనతో చిత్రంపై అంచనాలు బాగానే పెరిగాయి. రొమాన్స్, డివోషన్, విజువల్స్‌ మేళవించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో చూడాలి.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *