
వరుస సినిమాలతో దూసుకుపోతోంది హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal). పవన్ కల్యాణ్‌తో (Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’ ఫస్ట్ పార్ట్ షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు, డార్లింగ్ ప్రభాస్‌తో (Prabhas) ‘ది రాజాసాబ్’ (The Raja Saab) షూటింగ్లో పాల్గొంటోంది. ఆ తర్వాత కూడా పలు మూవీస్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జులై 24న విడుదల కానున్న హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా నిధి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తెలుగు ప్రేక్షకులు అంతే తనకు ఎంతో ఇష్టమన్నారు. వీరమల్లు మూవీ గురించి, పవన్ గురించి మాట్లాడారు.
ట్రైలర్‌ను ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదు
“హరిహర వీరమల్లు సినిమా విజువల్ వండర్లా ఉంటుంది. ఏఎం రత్నం ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. ఆయనతోపాటు టీమ్ అంతా సినిమా విజయంపై ఎంతో ధీమాగా ఉన్నారు. ట్రైలర్‌ను ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదు. ఈ సినిమా ప్రారంభంలో ఎన్నో రూమర్స్ వచ్చాయి. కానీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక వాటన్నిటికీ చెక్ పడింది. మనం ఓ పని చేస్తున్నప్పుడు ఎన్నో కామెంట్స్ వినిపిస్తాయి. వాటిని పట్టించుకోకుండా మన పని మనం చేయాలి. మొదట బాలేదు అన్న ప్రేక్షకులే వెంటనే చాలా బాగుంది అని అంటారు. చాలా బాగా యాక్ట్ చేశారు అని కామెంట్ చేస్తారు. అందుకే రూమర్స్‌ను పట్టించుకోకుండా మన పని శ్రద్ధగా చేస్తూ ఉండాలి’ అని పేర్కొన్నారు.
ప్రతి విభాగంలోనూ ఆయన భాగమయ్యారు
హరిహర వీరమల్లు కోసం పవన్ (Pawan Kalyan) ఎంతో కష్టపడ్డారని, సినిమాలో ప్రతి విభాగంలోనూ ఆయన భాగమయ్యారని తెలిపారు. డైలాగ్స్, పాటలు, యాక్షన్ సన్నివేశాలు అన్నిటికీ సలహాలిచ్చారన అన్నారు. ‘ఎన్నికల ముందు దీన్ని ప్రారంభించిన ఆయన.. డిప్యూటీ సీఎం అయ్యాక దీన్నే మొదట పూర్తిచేశారు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఆయనలో ఎలాంటి మార్పు రాలేదు. విజయవాడలో షూటింగ్ చేసినన్ని రోజులు ఒకవైపు మీటింగ్‌లో పాల్గొంటూనే షూటింగ్‌కు వచ్చేవారు. హరిహర వీరమల్లు పార్ట్-2 కూడా 20 నిమిషాల షూటింగ్ పూర్తిచేశాం. మొదటి పార్ట్ విడుదలైన తర్వాత దాన్ని తిరిగి ప్రారంభిస్తాం” అని నిధి అగర్వాల్ తెలిపారు.
20 mins of #HHVM2 done! The remaining shoot starts after Part 1 release.
:- #NidhiAgarwal @AgerwalNidhhi #HariHaraVeeraMallu pic.twitter.com/fRXlJSINk5
— 𝗛𝗮𝗿𝘀𝗵𝗮 𝗥𝗖 ™ 🏏 (@AlwaysHarshaaa) July 15, 2025