టాలీవుడ్ నుంచి చాలా మంది హీరోల వారసులు వచ్చి స్టార్ హీరోలయ్యారు. కొందరు నిలదొక్కుకోలేక ఫేడ్ అయిపోయారు. కానీ వారసురాళ్లు మాత్రం చాలా అరుదు. ఇక వాళ్లు సినిమాల్లోకి వచ్చినా.. కాస్ట్యూమ్, ప్రొడక్షన్ వంటి విభాగాల్లో పని చేస్తూ తెరవెనకాలకే పరిమితమయ్యారు. కానీ మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) మాత్రం తన కెరీర్ ను బుల్లితెరపై మొదలుపెట్టి.. మొదటి నుంచి తెరముందే కనిపించింది. ఇక ఒక మనసు చిత్రంతో ఏకంగా వెండితెరపైకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
View this post on Instagram
నిహారిక నుంచి రెండో ఫీచర్ ఫిల్మ్
ఓవైపు సినిమాల్లో నటిస్తూ.. నటిగా రాణిస్తూనే మరోవైపు నిర్మాణ రంగంలో తన సత్తా చాటుతోంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ (Pink Elephant Pictures) బ్యానర్‌పై మొదట షార్ట్ ఫిలిమ్స్, ఆ తర్వాత వెబ్ సిరీస్ లు తీసి సక్సెస్ అయింది. ఇక నెమ్మదిగా ఫిల్మ్ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అలా తన ప్రొడక్షన్ హౌసులో రూపొందించిన ‘కమిటీ కుర్రోళ్ళు (Committee Kurrollu)’ సూపర్ హిట్ అయ్యింది. ఈ క్రమంతో తాజాగా ఆమె బ్యానర్ నుంచి రెండో సినిమా ప్రకటన వచ్చేసింది.
నిహారిక సినిమాలో మ్యాడ్ హీరో
ఇటీవలే ఈ ప్రాజెక్టు గురించి సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయింది. అయితే తాజాగా నిహారిక తన రెండో సినిమా గురించి అప్డేట్ ఇచ్చింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ రెండో ప్రాజెక్ట్‌గా కొత్త సినిమా రెడీ అవుతోందని చెప్పింది. మానసా శర్మ (Manasa Sharma) ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు తెలిపింది. త్వరలో ఈ సినిమా షూట్ మొదలు కానుందని.. ఇదే ఏడాదిలో రిలీజ్ అవుతుందని వెల్లడించింది. అయితే ఈ సినిమాలో మ్యాడ్ ఫేమ్ నటుడు సంగీత్ శోభన్ (Sangeeth Shobhan) హీరోగా నటించనున్నట్లు తాజా అప్డేట్ చూస్తే తెలిసిపోతోంది. ఇటీవలే సంగీత్ మ్యాడ్ స్క్వేర్ సినిమాతో హిట్ కొట్టిన విషయం తెలిసిందే.






