టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithin), మోస్ట్ హాప్పెనింగ్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) జంటగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా రాబిన్ హుడ్. వెంకీ కుడుముల (Venky Kudumula) తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మార్చి 28వ తేదీన రిలీజ్ కానుంది. నేడు మహాశివరాత్రి సందర్భంగా మేకర్స్ ఈ సినిమా మేకింగ్ (Robinhood Making Video) వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో సూపర్ ఫన్ గా ఉంది.
రాబిన్ హుడ్ మేకింగ్ వీడియో
‘నాకు ఆస్కార్ రావాలి’ అంటూ శ్రీలీల అనగా.. బ్యాక్ గ్రౌండ్ లో పిచ్చోళ్ల గురించి వినడమే గానీ లైవ్ లో ఇదే చూడ్డం అని బ్రహ్మానందం డైలాగ్ రావడం ఈ వీడియోకే హైలైట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా షూటింగులో చిత్రబృందం జాలీగా గడిపినట్లు ఈ వీడియో చూస్తే అర్థమైపోతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూసి ఎంజాయ్ చేయండి.
లైట్స్ కెమెరా అండ్ ఫన్
ఇక ఈ సినిమా సంగతికి వస్తే నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా శ్రీలీల ఫీ మేల్ లీడ్ లో సందడి చేయనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ యెర్నేని, రవి శంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవి ప్రకాశ్ మ్యూజిక్ అందిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్రబృందం లైట్స్ కెమెరా అండ్ ఫన్ (#LightsCameraAndFun) అనే క్యాప్షన్ తో రాబిన్ హుడ్ మేకింగ్ వీడియోను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది.






