
పలు ఫెయిల్యూర్స్ తర్వాత హిట్ కోసం ఎదురుచూస్తున్న తినిన్ (Nithin) కొత్త మూవీ ‘తమ్ముడు’ (Thammudu) ఈరోజు (జులై 4న) రిలీజ్ అయ్యింది. పవన్ కల్యాణ్‌తో వకీల్ సాబ్తో హిట్ కొట్టిన దర్శకుడు వేణు శ్రీరామ్ (Venu Sriram) చాలా గ్యాప్ తర్వాత తెరకెక్కించిన మూవీ ఇది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తుండడం, రిలీజ్ వేడుకల్లోనూ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేయడం, ట్రైలర్ సైతం ఆకట్టుకునేలా ఉండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ (Nithin Thammudu Movie Review) ఎలా ఉందో చూద్దాం..
ఇదీ కథ
జై (Nithin) ఆర్చరీలో దేశం తరఫున పాల్గొని ఎన్నో పతకాలు సాధిస్తాడు. అయితే జై చిన్నతనంలో జరిగిన కొన్ని సంఘటనలతో అక్క స్నేహలత (Laya) ఆ కుటుంబానికి దూరమవుతుంది. ఇక పుట్టింటి గడప తొక్కనని శపథం చేసి వెళ్లిపోతుంది. తండ్రి చనిపోయినా చూసేందుకు రాదు. అయితే అక్క విషయంలో చేసిన ఓ చిన్న తప్పు జైని వెంటాడుతూ ఉంటుంది. ఆ తప్పు గురించి అక్కకు చెప్పి ఆమెకు మళ్లీ దగ్గరవ్వాలని భావిస్తాడు. ఫ్రెండ్ చిత్ర (Varsha Bollamma)తో కలిసి బయల్దేరతాడు. కానీ స్నేహలత కుటుంబంతో కలిసి అంబర గొడుగు అటవీ ప్రాంతంలో జరిగే అమ్మవారి జాతరకు వెళ్లడంతో ఆమెను కలిసేందుకు ఈ ఇద్దరు కూడా అక్కడికి వెళ్లేందుకు సిద్ధమవుతాడు. అయితే ఝాన్సీ, ఆమె కుటుంబాన్ని అజర్వాల్ (Saurabh Sachdeva) ముఠా వెంటాడుతోంది అని తెలుసుకున్న జై ఏం చేస్తాడు? అక్కను కలుసుకున్నాడా? ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే!
ఎలా ఉందంటే…
అక్కా తమ్ముడి కథతో ముడిపడిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఇది. అక్కాతమ్ముళ్లు ఒకరికొకరు దూరమైన తీరు, కుటుంబ నేపథ్యంలోని సన్నివేశాలు మెప్పించాయి. విలన్ ను ఎలివేట్ చేసిన విధానం, అతడి పాత్ర బాగుంది. హీరో అడవి బాట పట్టేవరకూ సినిమా బాగానే ఉంది. కానీ ఆ తర్వాతే గాడి తప్పింది. ట్రైలర్లో చూపించిన అడవిలో హీరో చేసే సాహసాలు మెప్పించలేకపోయాయి. ఒకటి, రెండు యాక్షన్ సీన్స్ తప్ప.. మిగతావి ఆకట్టుకోలేకపోయాయి. సాంగ్స్ సైతం ప్రభావం చూపలేదు. సౌండ్ డిజైన్, విజువల్స్ కూడా యావరేజ్‌గానే ఉన్నాయి. సప్తమి గౌడ (Sapthami Gowda) పాత్ర సైతం మెప్పించలేకపోయింది. కథ, కథనాల్లో బలం కనిపించలేదు.
* రేటింగ్: 2.5/5