నేచురల్ స్టార్ నాని(Nani), డైరెక్టర్ శైలేష్ కొలను(Sailesh Kolanu) కాంబో వచ్చిన చిత్రం హిట్: ది థర్డ్ కేస్(Hit: The Third Case). క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యాక్షన్ థ్రిల్లర్‌గా థియేటర్లలో ఆడియన్స్‌తో విజిల్స్ కొట్టించిన ఈ మూవీకి చిక్కొచ్చిపడింది. హిట్-3 కథను తన నుంచి కాపీ కొట్టారని విమల్ వేలన్(Vimal Velan) అనే స్క్రిప్ట్ రైటర్ ఆరోపించడంతో మద్రాస్ హైకోర్టు(Madras High Court) నానితో పాటు మూవీ టీమ్‌కు లీగల్ నోటీసులు(Legal Notice) పంపింది. కాగా హిట్ 3 స్టోరీ తన కథకు అనధికారిక అనుసరణ అని విమల్(Vimal) హైకోర్టుకు తెలిపారు. ఇది 2021 ఆగస్టు 4న సౌత్ ఇండియన్ ఫిల్మ్ రైటర్స్ అసోసియేష(South Indian Film Writers Association)న్లో రిజిస్టర్ అయిన స్క్రిప్ట్ కాపీ అని అతను పేర్కొన్నారు.
తన కథనే సినిమాగా తీశారంటూ పిటిషన్
తనతో కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో 2022 ఆగస్టు 8న నాని(Nani) స్క్రిప్ట్ సమర్పించానని, కానీ ఎలాంటి స్పందన రాలేదని విమల్ పేర్కొన్నారు. కానీ హిట్ 3 విడుదలయ్యాక థియేటర్‌లో చూశానన్నారు. చిన్న చిన్న మార్పులతో తన కథనే సినిమాగా తీశారని తెలిసి షాక్ అయ్యానని స్క్రిప్ట్ రైటర్ విమల్ తన పిటిషన్లో పేర్కొన్నారు. తన స్క్రిప్ట్ కు, సినిమాకు ఉన్న పోలికల జాబితాను కూడా సమర్పించారు.
నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
తన మేధో సంపత్తి(Copy Right)ని ఉల్లంఘించడం మానుకోవాలని విమల్ గతంలో నానితో పాటు హిట్ 3 టీంకు లీగల్ నోటీసులు పంపినా స్పందన లేదు. సినిమా లాభాల్లో 20 శాతం నష్టపరిహారం(compensation) చెల్లించాలని విమల్ డిమాండ్ చేస్తున్నారు. ఆ చిత్ర బృందం తనకు ఆర్థికంగా నష్టం కలిగించిందని ఆయన వాదిస్తున్నారు. రైటర్స్ అసోసియేషన్(Writers Association)కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు. దీనిపై స్పందించేందుకు హైకోర్టు హిట్ 3 బృందానికి జులై 7 వరకు గడువు ఇచ్చింది. కాగా ఈ ఏడాది మేలో విడుదలైన హిట్ 3లో నాని అర్జున్ సర్కారు(Arjun Sarkar)గా అదరగొట్టాడు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.120 కోట్లకుపైగా వసూల్ చేసింది.
HIT 3 Copyright Case Update:
Madras HC has asked the #HIT3 team and Netflix to respond by July 7.
The next hearing is set. #Agent11VsHIT3 #CopyrightBattle pic.twitter.com/zF2IrPIG5B— Filmi Street (@filmistreet) June 21, 2025






