
ఇటీవల పల్నాడు జిల్లా(Palnadu District)లో సింగయ్య మృతి కేసు(Singaiah death case)లో ఏపీ మాజీ సీఎం జగన్(Ex Cm Jagan)కు పోలీసులు నోటీసులిచ్చారు. పల్నాడు జిల్లా రెంటపాళ్లలో జగన్ పర్యటన(Jagan Tour) సందర్భంగా సింగయ్య ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు జగన్ను A2 నిందితుడిగా చేర్చారు. ఈ మేరకు నోటీసులు(Notice) ఇచ్చేందుకు తాడేపల్లిలోని YCP కార్యాలయానికి నల్లపాడు పోలీసులు వెళ్లారు. కార్యాలయ కార్యదర్శి అప్పిరెడ్డి నోటీసులు అందుకున్నారు. ప్రమాదానికి కారణమైన ఫార్చ్యూనర్ (AP 40 DH 2349) వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.
కీలక ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్
కాగా సింగయ్య(Singaiah) అనే వ్యక్తి మృతి తీవ్ర వివాదాస్పదం అయిన నేపథ్యంలో నిన్న YCP అధినేత జగన్ సీఎం చంద్రబాబు(CM Chandrababu)పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు తన తీరుతో రాజకీయాల(Politics)ను మరింత దిగజార్చారని ఆరోపిస్తూ, పలు కీలక ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తన పర్యటనలపై ఆంక్షలు(Ristrictions) ఎందుకు విధిస్తున్నారని, కార్యకర్తలు తనను కలవకుండా ఎందుకు కట్టడి చేస్తున్నారని జగన్ ప్రశ్నించారు. “గతంలో మీరు గానీ, మీ మిత్రుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) గానీ పర్యటనలు చేసినప్పుడు మేమెప్పుడైనా ఇలాంటి ఆంక్షలు విధించామా?” అని నిలదీశారు. ప్రతిపక్ష నాయకుడిగా పార్టీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లడం, రైతులు, ప్రజలకు సంఘీభావం తెలపడం తప్పా అని ప్రశ్నించిని విషయం తెలిసిందే.