
ప్రతి తల్లి తమ బిడ్డలు మంచి స్థాయిలో ఉండాలని, మంచి పేరును సంపాదించాలని, తమ పిల్లలను ఇతరులు అభిమానించాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలినీ కూడా తన కుమారుడు జీవితంలో బాగా సెటిల్ కావాలి, సమాజానికి ఆదర్శంగా నిలవాలి అనేది ఆమె ఆకాంక్ష. నిజానికి ఆ కోరిక నేడు నిజమైంది. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా స్టార్ హీరోగా పేరు తెచ్చుకోవడమే కాకుండా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న స్టార్ హీరో .
ఎన్టీఆర్ చదువుకునే రోజుల్లో అల్లరి పిల్లాడిలా.. కోపం వస్తే బూతు పదాలు బాగా వాడేవాడట. అయితే ఒకసారి తారక్ కోపంతో బూతులు మాట్లాడుతున్న సమయంలో, తల్లి షాలినీ ఎన్టీఆర్ దగ్గర ప్రామిస్ తీసుకుందట. ఏ పరిస్థితిలోనైనా బూతు పదాలు వాడకూడదు అని ప్రామిస్ చేయించుకుందట. తల్లికి ఇచ్చిన మాటతో ఎంత కోపం వచ్చిన బూతు పదాలు వాడటం పూర్తిగా మానేశాడు తారక్.
ఇప్పటికీ ఎవరైనా తనను తిట్టినా, విమర్శించినా, జూనియర్ ఎన్టీఆర్ నిశ్శబ్దంగా మౌనంగా ఉంటూ క్షమించి ముందుకు సాగుతాడు. తల్లి మాటను గౌరవిస్తూ కోపాన్ని నియంత్రించుకోవడం ఆయనకు అలవాటైంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. నటుడిగా మాత్రమే కాదు, వ్యక్తిత్వంగా కూడా ఎదిగిన తారక్, తల్లికి ఇచ్చిన మాటను జీవితానికి మార్గదర్శకంగా తీసుకుని నడుస్తున్నాడు.
తారక్ తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ సినిమాలను అందించాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశ వ్యాప్తంగా స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ప్రత్యేకంగా జపాన్ లో విపరీతమైన ఫాన్స్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్, అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం వార్2లో నటిస్తున్నాడు . హృతిక్ రోషన్ కూడా మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.
వార్2 తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’ సినిమాలో నటించనున్నాడు. వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభం కాబోతుంది.