అభిమానులకు ఎన్టీఆర్ గుడ్ న్యూస్.. త్వరలోనే ఫ్యాన్ మీట్

సినిమా హీరోలంటే మూవీ లవర్స్ కు ఓ రేంజులో ప్రేమ ఉంటుంది. కొందరి ప్రేమ, ఆరాధన కాస్త పరిధులు దాటి హద్దులు మీరుతూ అటు హీరోలకు ఇటు తమ కుటుంబాలకు నష్టం చేకూర్చుతుంది. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలంటే ఏకంగా దేవుళ్లన్న భావన కొందరు అభిమానులకు ఉంటుంది. అందుకే తమ ఫేవరెట్ నటులపై తమ అభిమానాన్ని చాటుకునేందుకు అప్పుడప్పుడు సాహసాలు చేస్తుంటారు.

తారక్ పై ఎనలేని అభిమానం

ఇక టాలీవుడ్ లో మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఒకరు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (NTR). ఆయనంటే చాలా మందికి ఎంతో అభిమానం. ఏకంగా ఆయన సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు పది లక్షల మంది ఫ్యాన్స్ వచ్చారంటే ఆయనుకున్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. తారక్ కు కూడా తన అభిమానులంటే అంతే ఆప్యాయత. ఆయన ఎల్లప్పుడు వారి క్షేమాన్నే కోరతారు.

పాదయాత్రలు చేయొద్దు

అందుకే ఏదైనా ఈవెంట్ జరిగితే వెళ్లేటప్పుడు అందరూ ఇంటికి జాగ్రత్తగా వెళ్లమని మరీ మరీ చెబుతుంటారు. సినిమా హీరోల కోసం లైఫ్ ను పాడు చేసుకోవద్దంటూ సూచిస్తుంటారు. తాజాగా తారక్ మరోసారి తన అభిమానులను (NTR About Fans) ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి ఎన్టీఆర్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. తనను చూసేందుకు పాదయాత్రలు వంటివి చేసి రావొద్దని సూచించారు.

త్వరలోనే ఫ్యాన్ మీట్

తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకున్న ఆయన త్వరలో వారి కోసం ఫ్యాన్ మీట్  (NTR Fan Meet )ఈవెంట్ ను ఏర్పాటు చేస్తానని తెలిపారు. అలా వ్యక్తిగతంగా తానే తన అభిమానుల వద్దకు వస్తానని మాటిచ్చారు. ఇందుకోసం పోలీసులు, ఇతర అధికారుల అనుమతి తప్పక తీసుకుంటానని చెప్పారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా జాగ్రత్త తీసుకుంటామని వెల్లడించారు.

కాస్త టైం ఇవ్వండి

అయితే ఇంత పెద్ద ఈవెంట్ ఏర్పాటు చేసేందుకు చాలా విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది తారక్ అన్నారు. తనను కలిసేందుకు వచ్చే అభిమానులు క్షేమంగా ఇంటికి వెళ్లే బాధ్యత తనపై ఉన్నందున ఆ దిశగా కార్యక్రమం విజయవంతమయ్యేలా ఏర్పాట్లు చేయాల్సి ఉందని తెలిపారు. అందుకే ఈ ఈవెంట్ కు కాస్త సమయం అవసరం అవుతుందని.. అప్పటి వరకు అభిమానులు కాస్త ఓపికగా ఉండాలని కోరారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *