ఎన్టీఆర్-నీల్ సినిమా అప్డేట్.. కర్ణాటకకు తారక్ పయనం

మ్యాన్ ఆఫ్ మాసెస్  ఎన్టీఆర్‌ (NTR) వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓవైపు వార్-2 (War-2)తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ షూటింగు పూర్తి చేసుకున్న తారక్ తర్వాత తన తదుపరి సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా తారక్..  కొత్త సినిమా సెట్లోకి అడుగు పెడుతున్నాడు. అందుకోసం ఆయన ఆదివారం ఉదయం కర్ణాటకకు వెళ్లాడు. మంగళవారం నుంచి ఎన్టీఆర్ తన కొత్త మూవీ షూటింగులో పాల్గొననున్నాడు.

Image

ఎన్టీఆర్-నీల్ మూవీ అప్డేట్

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ (Prashant Neel) కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ కలిసి రూపొందిస్తున్న ఈ  చిత్రం నుంచి తాజాగా ఓ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగు రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ షెడ్యూల్ ఎన్టీఆర్‌ లేకుండానే షూటింగ్ పూర్తి చేశారు. ఇక నెక్స్ట్ షెడ్యూల్ లో తారక్ పాల్గొననున్నారు.

నీల్ సినిమా సెట్లో తారక్

ఈ నేపథ్యంలోనే ఆయన తాజాగా కర్ణాటక(NTR in Karnataka)కు వెళ్లారు. మంగళవారం నుంచి అక్కడ ప్రారంభం కానున్న నెక్స్ట షెడ్యూల్ షూటింగులో తారక్ పాల్గొంటారు. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ పై నీల్ కీలక సన్నివేశాలు షూట్ చేయనున్నట్లు సమాచారం. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తారక్ ను ఊరమాస్ యాక్షన్ హీరోగా నీల్ చూపించబోతున్నారు.

Image

డ్రాగన్ వర్కింగ్ టైటిల్

ఎన్టీఆర్‌ – నీల్‌ సినిమా పీరియాడిక్‌ కథతో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన  కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్‌ (Rukmini vasanth)నటిస్తోందనే ప్రచారం సాగుతోంది. ఇక ఈ చిత్రానికి ‘డ్రాగన్‌’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది.  కల్యాణ్‌రామ్‌ నందమూరి, నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *