ఎన్టీఆర్ (NTR), హృతిక్ రోషన్ (Hrithik Roshan) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వార్ 2’ (WAR 2). అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో సాగే మూవీలో కియారా అడ్వాణీ (Kiara Advani) హీరోయిన్. ‘వార్’కు కొనసాగింపుగా రూపొందిన ఈ కోసం అటు బాలీవుడ్ అభిమానులతోపాటు ఎన్టీఆర్ నటిస్తుండడంతో ఇటు తెలుగు ప్రేక్షకులతోపాటు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మరో 50 రోజుల్లో ఇది విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం కౌంట్‌డౌన్ మొదలుపెట్టింది. సినిమాలోని ప్రధాన నటీనటుల సరికొత్త పోస్టర్లను సోషల్‌మీడియాలో పంచుకుంది.

ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14న విడుదల
ఈ ప్రచార చిత్రాలను అభిమానులతో ఎన్టీఆర్ (NTR) సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘బెట్ కాస్తున్నా.. ఇలాంటి వార్‌ను మీరెప్పుడూ చూసి ఉండరు. కౌంట్‌డౌన్ మొదలుపెట్టండి’’ అని పేర్కొన్నారు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న ఆరో చిత్రమిది. 2019లో విడుదలైన ‘వార్’కు కొనసాగింపుగా ఇది రూపొందుతోంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ప్రచార చిత్రాలు ఈ సినిమాపై అంచనాలు పెంచాయి.
The WAR just got bigger, bolder, and more explosive! 💥
Three forces. One battlefield. Total destruction awaits.
🔥 Hrithik Roshan
⚡ Kiara Advani
⚔️ NTR
Experience the storm in IMAX this 14th August!#WAR2 #YRFSpyUniverse #HrithikRoshan #KiaraAdvani #NTR #Bollywood pic.twitter.com/jgFpl8UsKV— Saddam Hussain (@saddam_huss2021) June 26, 2025






