నువ్వు నేను హీరోయిన్ గుర్తుందా గురూ..! ఇప్పుడెలా ఉందో చూస్తే షాకవుతారు

ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే అడుగుపెట్టిన ఉదయ్ కిరణ్(Uday Kiran), మొదటి 3 సినిమాలైన చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలు సాధించి, ముఖ్యంగా ప్రేమకథా చిత్రాలతో యూత్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. అతను నటించిన సినిమాలకు ఇప్పటికీ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఉదయ్ కిరణ్ డైలాగ్స్, సాంగ్స్, సినిమాలు అన్నీ కూడా ఎప్పటికీ ఎవర్‌గ్రీన్.

ఉదయ్ కిరణ్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన సినిమా నువ్వు నేను(Nuvvu Nenu). డైరెక్టర్ తేజ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బిగ్ బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ సరసన అనిత(Anita Hassanandani) హీరోయిన్ గా నటించింది. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకుని కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయింది. నువ్వు నేను తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అనితకి ఆ తర్వాత కూడా వరుసగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. శ్రీరామ్, తొట్టి గ్యాంగ్, నిన్నే ఇష్టపడ్డాను వంటి చిత్రాల్లో నటించినా, అవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో తెలుగులో మాత్రం వరుసగా అవకాశాలు లభించాయి.

ప్రస్తుతం అనిత హిందీ సీరియల్స్‌తో పాటు పలు షోలలో బిజీగా ఉంటుంది. 2013లో గోవాలో కార్పొరేట్ ప్రొఫెషనల్ రోహిత్ రెడ్డిని వివాహం చేసుకుంది. కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన అనిత, ఇప్పుడు మళ్లీ రీఎంట్రీకి సిద్ధమవుతోంది. సుహాస్, మాళవిక మనోజ్ నటిస్తున్న ఓ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషిస్తోంది. తెలుగులో ఇదే ఆమె రీ ఎంట్రీ కావడం విశేషం. తాజాగా చీరకట్టులో ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ చుసిన నెటిజన్లు మీ అందం ఏ మాత్రం తగ్గలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *