ఈ ఏడాది ఇస్రో( ISRO) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తొలి ప్రయోగానికి అవరోధం ఏర్పడింది. జనవరి 29న శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SHAAR) నుంచి 100వ రాకెట్‌ను లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. ఈ రాకెట్ నిప్పులు చిమ్ముతూ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. GSLV-F15 వెహికల్ UR రావు శాటిలైల్ సెంటర్ తయారు చేసిన NVS-02 ఉపగ్రహాన్ని మోసుకెళ్లింది. ఇది ఒక నావిగేషన్ శాటిలైట్.
పరిష్కార మార్గాల్ని అన్వేషిస్తోన్న ఇస్రో
అయితే ఈ శాటిలైట్(Satellite)లో టెక్నికల్(Thrusters) సమస్య తలెత్తినట్లు ఇస్రో తెలిపింది. ఆక్సిడైజర్లను సరఫరా చేసే వాల్వ్‌లు తెరచుకోకపోవడంతో ఇంజిన్లు మొరాయిస్తున్నట్లు ఇస్రో తెలిపింది. ఇంజిన్లు ఫైర్ అయితేనే శాటిలైట్‌ను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంటుంది. భారత్ సొంత నేవిగేషన్ వ్యవస్థ( Navigation System) అయిన నావిక్‌కు NVS-02 కీలకం. ఈ నేపథ్యంలో పరిష్కార మార్గాల్ని ఇస్రో అన్వేషిస్తోంది. కాగా భూమికి 36,000KM ఎత్తున GTO ఆర్బిట్‌లోకి NVS-02 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టాలని ఇస్రో భావించింది. కానీ టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా ప్రస్తుతం శాటిలైట్ మొరాయిస్తోందని ఇస్రో(ISRO) వెల్లడించింది.
మెరుగైన నావిగేషన్ సిస్టమ్ అందించాలనే..
అయితే శాటిలైట్ ప్రస్తుతం నావిగేషన్ వ్యవస్థకు అనుకూలించని దీర్ఘవృత్తాకార జియో సింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లో భూమి చుట్టూ తిరుగుతోందని ఇస్రో పేర్కొంది. NVS-02 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశ పెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపింది. NVS-02 ఉపగ్రహం భారత్ తదుపరి తరం NavIC వ్యవస్థలో రెండవ ఉపగ్రహం. ఇది భారత్‌లోని ప్రజలకు భారత భూభాగం నుంచి 1,500 కి.మీ వరకు ఉన్న ప్రాంతాలకు కచ్చితమైన స్థానం, వేగం, సమయ డేటా, మెరుగైన నావిగేషన్ సిస్టం(Navigation system) అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా దీనిని రూపొందించారు.
Isro said on Sunday that the satellite’s systems ‘are healthy’ and that the satellite is in an elliptical orbit around Earth. Read more#IndianSpaceResearchOrganisation #ISRO #NVS02Satellite #Malfunctionhttps://t.co/ldzemZqwhn
— The Telegraph (@ttindia) February 3, 2025






