రవితేజ (Ravi Teja), శ్రీలీల (Sreeleela) కాంబినేషన్ లో వస్తున్న మూవీ ‘మాస్ జాతర’ (Mass Jathara). భాను భోగవరపు అనే కొత్త డైరెక్టర్ రూపొందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆగస్టు 27న సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ నుంచి ఇదివరకే రిలీజ్ అయిన ‘తూ మేరా లవర్’ (Tu Mera Lover) సాంగ్ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మాయతో దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి వాయిస్ ను అచ్చుగుద్దినట్లు దింపారు. తాజాగా మాస్ జాతర నుంచి మరో సాంగ్ ను విడుదల చేశారు. ‘ఓలే.. ఓలే..’ (Ole Ole Song) అంటూ సాగే లిరికల్ వీడియోను చిత్ర బృందం మంగళవారం రిలీజ్ చేసింది. భాస్కర్ యాదవ్ అందించిన లిరిక్స్ కు మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) హుషారైన మ్యూజిక్ అందించారు. మ్యూజిక్ మాత్రమే కాకుండా సింగర్ రోహిణి సొర్రాట్ తో కలిసి పాడారు. ఈ సాంగ్ ను మీరూ చూసేయండి.






