
ఆమె ఒక కి‘లేడీ’.. తన మధురమైన మాటలతో అమాయకపు మగవారి(mens cheated)ని తన బుట్టలో వేసుకుంటుంది. ప్రేమ పేరుతో (love and marriage) తన వలలో వేసుకుని పెళ్లి వరకు తీసుకెళ్తుంది. ఎవరికి తెలియకుండా పెళ్లికి మగవారిని ఒప్పించి గుట్టుగా వివాహం చేసుకుని కాపురం పెడుతుంది. వివాహం జరిగిన కొద్ది రోజుల వరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాతే ఆవిడ గారి నిజస్వరూపం బయట పడుతుంది. ఉన్నట్టుండి చెప్పకుండా ఇంట్లోని డబ్బులు, నగల(cash and gold)తో పరారవుతుంది.ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 25 మంది (25 members victims)ని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసిన మహిళను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు.
పక్కా పథకం ప్రకారమే..
రాజస్థాన్‌కు చెందిన అనురాధ పాసవాన్ (Rajastan women anuradha pasavan) అనే మహిళ.. వివాహం పేరుతో తనను మోసం చేసిందని బాధిత భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎట్టకేలకు ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో భాగంగా ఆమె లీలలు బయట పడటంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్లాన్ ప్రకారం పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే వరుడి ఇంట్లో ఉన్న డబ్బు, బంగారంతో ఉడాయించడం ఆమెకు హాబీగా మారిపోయిందని పోలీసులు గుర్తించారు.
అమాయక యువకులే టార్గెట్..
పోలీసుల కథనం ప్రకారం.. అనురాధ పలువురు అమాయక యువకులను లక్ష్యంగా చేసుకుంది. మొదట వారిని పెళ్లి చేసుకుని, నమ్మకం సంపాదించిన తర్వాత ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి డబ్బు, ఆభరణాలతో ఉడాయించేది. ఈమె మోసాలు రాజస్థాన్‌లోని వివిధ ప్రాంతాలలో జరిగాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనురాధ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు, సాంకేతిక ఆధారాలు, బాధితుల సమాచారం ఆధారంగా పోలీసులు అనురాధను అరెస్టు(Arrested) చేశారు. ఈమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా, వివాహాల పేరుతో జరిగే మోసాలపై అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది.