Search Operation: జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న ఉగ్రవేట

పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో ముష్కరుల(Terrorists) కోసం వేట కొనసాగుతోంది. ఉగ్రవాదుల కోసం భద్రతా సిబ్బంది(Armed Forces), పోలీసులు(Police) తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ మేరకు అనుమానితుల నివాసాల్లో పోలీసులు ముమ్మరంగా సోదాలు(Search Operation) నిర్వహించారు. పహల్గాం దాడి అనంతరం ఇప్పటివరకు 100కు పైగా అనుమానిత ఉగ్రవాదులు, వారి అనుచరుల ఇళ్లల్లో తనిఖీలు చేసినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం ఒక్కరోజే 30కి పైగా ప్రాంతాల్లో సోదాలు చేసినట్లు చెప్పారు.

ఉగ్రదాడిలో భాగమైన ప్రతి ఒక్కరికీ శిక్ష తప్పదు

పహల్గాం దారుణం అనంతరం జమ్మూకశ్మీర్‌(J&K)లో పోలీసులు సోదాలు ప్రారంభించారు. కాగా ఇప్పటివరకు 100కు పైగా ఉగ్రవాదుల అనుచరులు, అనుమానితుల ఇళ్లల్లో సోదాలు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ‘‘ఉగ్రవాదులకు మద్దతిచ్చి దాడులకు సహకరిస్తున్న వారిని పట్టుకోవడంలో రాష్ట్ర పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నిషేధిత ఉగ్రవాద సంస్థలు(Prohibited terrorist organizations), చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు చేసేవారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. దీనిలో భాగంగానే 100కు పైగా ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. ఉగ్రదాడిలో భాగమైన ప్రతి ఒక్కరికీ శిక్ష పడాల్సిందే’’ అని పోలీసు అధికారులు తెలిపారు. కాగా ‘ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)’ పేరిట ఇండియన్ ఆర్మీ ఉగ్రవాద స్థావరాల(Terrorist bases)పై దాడి చేసిన విషయం తెలిసిందే.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Road Accident: పుణ్యక్షేత్రానికి వెళ్తుండగా ప్రమాదం.. 8 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌(UP)లోని బులంద్‌శహర్-అలీగఢ్ సరిహద్దు(Bulandshahr-Aligarh border)లో సోమవారం (ఆగస్టు 25) తెల్లవారుజామున 2:15 గంటల సమయంలో ఘోర రోడ్డు(Road Accident) ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని జహర్‌పీర్ (గోగాజీ) పుణ్యక్షేత్రానికి యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ(Tractor trolley)ని వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *