వివిధ రంగాల్లో సేవలందించిన ప్రతిభావంతులకు ప్రదానం చేసే దేశ అత్యున్నత పౌర పురస్కారాలు ‘పద్మ అవార్డ్స్(Padma Awards)’ కోసం కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ అవార్డుల కోసం నామినేషన్ల(Nominations) ప్రక్రియ ప్రారంభించింది. ఆసక్తి ఉన్నవారు జులై 31లోపు నామినేషన్లు, సిఫార్సులు రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్(Rashtriya Puraskar Portal)లో అప్లోడ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం(Central Govt) వెల్లడించింది.
ఏటా మార్చి, ఏప్రిల్లో..
కాగా దేశంలోని రెండు అత్యున్నత పౌరపురస్కారాలైన భారతరత్న(Bharat Ratna), పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం 1954లో ప్రారంభించింది. భారత్తో పాటు వివిధ దేశాలకు చెందిన వారికి సైతం అవార్డులను కేంద్రం ప్రకటిస్తుంది. వివిధ రంగాల్లో ప్రతిష్ఠాత్మక, అసాధారణ సేవలు అందించినందుకు అవార్డులతో సత్కరిస్తుంది. వీటిని ఏటా గణతంత్ర దినోత్సవం(Republic Day) సందర్భంగా ప్రకటిస్తుండగా.. మార్చి, ఏప్రిల్లో రాష్ట్రపతి(President) చేతులమీదుగా అందజేస్తారు.
ఈ ఏడాది అవార్డులు ఎంతమందికంటే..
ఇక 2025 ఏడాదికి గానూ కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను (Padma Awards 2025) ఇటీవల అందించిన విషయం తెలిసిందే. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మ శ్రీ పురస్కారాలు అందజేసిన విషయం తెలిసిందే.






