ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan)తోపాటు బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానాకు అరుదైన గౌరవం లభించింది. ఈ ఇరువురు గ్లోబల్ క్లబ్‌లో భాగమయ్యారు. ఆస్కార్ అకాడమీలోకి (Oscar Academy) వీరికి ఆహ్వానం లభించింది. హాలీవుడ్ నటీనటులతో పాటు ఆస్కార్ ఓటింగ్ ప్రక్రియలో పాలుపంచుకోనున్నారు. ఈ ఏడాది ఆస్కార్ అకాడమీలో చోటుదక్కిన వారి జాబితాను ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (the Academy of Motion Picture Arts & Sciences) తాజాగా విడుదల చేసింది.
#KamalHaasan invited to join the Oscars Academy; The gesture highlights KH’s remarkable legacy in Indian and international film-making!
Read here https://t.co/2ePwKUpQku #Academy2025 #Oscars @ikamalhaasan @RKFI
— Only Kollywood (@OnlyKollywood) June 27, 2025
ఇందులో నటులు కమల్ హాసన్, ఆయుష్మాన్ ఖురానాలతో పాటు దర్శకురాలు పాయల్ కపాడియా, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మాక్సిమా బసు కూడా ఉన్నారు. హాలీవుడ్ స్టార్లు అరియానా గ్రాండే, సెబాస్టియన్ స్టాన్, జెరేమీ స్ట్రాంగ్ తదితరులతో వీరు వేదికను పంచుకోనున్నారు. ఆస్కార్‌కు నామినేట్ అయ్యే చిత్రాల్లో ఫైనల్ ఎంపిక ప్రక్రియలో ఓటు వేసే అవకాశం వీరికి ఉంటుంది.
ఈ ఏడాది 534 మంది సభ్యులకు ఆహ్వానం
ఈ ఏడాది కొత్తగా 534 మంది సభ్యులను ఆహ్వానించినట్లు అకాడమీ తెలిపింది. ప్రతిభావంతులైన వీరికి అకాడమీలో చోటు కల్పించడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొంది. నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలను ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆహ్వానించింది. ఈ సంవత్సరం చోటు దక్కించుకున్న 534 మందిలో 41 శాతం మంది మహిళలు ఉండడం విశేషం. వచ్చే ఏడాది మార్చి 15న జరిగే ఆస్కార్ వేడుకకు జనవరి 12 నుంచి 16 వరకూ నామినేషన్ ప్రక్రియ సాగనుంది. నామినేషన్ల పరిశీలన తర్వాత ఫైనల్ లిస్ట్ను జనవరి 22న ప్రకటిస్తారు.






