ప్రపంచ సినీ ఇండస్ట్రీ(The global film industry)లోనే అతిపెద్ద, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డుకు 2025కి(Oscar Awards 2025) సంబంధించి నామినేషన్స్(Nominations) ప్రకటించారు. ఈ అవార్డు కోసం పోటీ పడుతున్న సినిమాల లిస్ట్‌ను ఆస్కార్స్ అకాడమీ(Oscars Academy) వెల్లడించింది. ఇందులో బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఇండియన్-అమెరికన్ చిత్రం ‘అనుజా’ చోటు దక్కించుకుంది. వాస్తవానికి ఈ జాబితాను జనవరి 17వ తేదీనే వెల్లడించాల్సి ఉన్నప్పటికీ అమెరికా(USA)లోని లాస్ ఏంజెలిస్(Los Angeles)లో కార్చిచ్చు కారణంగా జనవరి 23కి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఉత్తమ చిత్రం, బెస్ట్ డైరెక్టెర్, బెస్ట్ యాక్టర్, ఉత్తమ నటి, బెస్ట్ కో-యాక్టర్, ఉత్తమ సహాయ నటికి సంబంధించి ఫైనల్ నామినీస్ను ప్రకటించింది. వీరిలో విజేత(Winner)ను మార్చి 3వ తేదీన వెల్లడించి అవార్డు అందజేస్తారు. కాగా ఇవి 97వ ఆస్కార్ అవార్డులు కావడం విశేషం.
బెస్ట్ యాక్టర్
☛ అడ్రియన్ బ్రాడీ- (ది బ్రూటలిస్ట్)
☛ తిమోతీ చలమెట్ – (ఐ యామ్ స్టిల్ హియర్)
☛ కోల్మన్ డొమింగో- (సింగ్ సింగ్)
☛ రాల్ఫ్ ఫియన్నెస్- (కాన్క్లేవ్)
☛ సెబాస్టియన్ స్టాన్ – (ది అప్రెంటిస్)
ఉత్తమ నటి
✦ సింథియా ఎరివో- (విక్డ్)
✦ కార్లా సోఫియా గాస్కోన్- (ఎమిలియా పెరెజ్)
✦ మిక్కీ మాడిసన్- (అనోరా)
✦ డెమి మూర్ – (ది సబ్ స్టాన్స్)
✦ ఫెర్నాండా టోర్రెస్- (ఐ యామ్ స్టిల్ హియర్)
ఉత్తమ సహాయ నటుడు
☛ యురా బోరిసోవ్- (అనోరా)
☛ కిరెన్ కల్కిన్- (ది రియల్ పెయిన్)
☛ ఎడ్వర్డ్ నార్తన్- (ది కంప్లీట్ అన్నోన్)
☛ గాయ్ పియర్స్- (ది బ్రూటలిస్ట్)
☛ జెరీమీ స్ట్రాంగ్- (ది అప్రెంటిస్)
ఉత్తమ సహాయ నటి
✷ మోనికా బార్బరో- (ది కంప్లీట్ అన్నోన్)
✷ అరియానా గ్రాండే- (విక్డ్)
✷ ఫెలిసిటీ జోన్స్- (ది బ్రూటలిస్ట్)
✷ ఇసాబెల్లా రోసెల్లిని- (కాన్క్లేవ్)
✷ జోయ్ సల్డెనా- (ఎమిలియా పెరెజ్)
ఉత్తమ చిత్రం
☛ అనోరా
☛ ది బ్రూటలిస్ట్
☛ ఎ కంప్లీట్ అన్నోన్
☛ కాన్క్లేవ్
☛ డ్యూన్: పార్ట్2
☛ ఎమిలియా పెరెజ్
☛ ఐయామ్ స్టిల్ హియర్
☛ నికెల్ బాయ్స్
☛ ది సబ్‌స్టాన్స్
☛ విక్డ్
బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ
✷ ఐ యామ్ స్టిల్ హియర్ – బ్రెజిల్
✷ ది గర్ల్ విత్ ది నీడిల్- డెన్మార్క్
✷ ఎమిలియా పెరెజ్-ఫ్రాన్స్ ది సీడ్ ఆఫ్ ది సేక్రేడ్ ఫిగ్- జర్మనీ
✷ ప్రవాహం- లాట్వియా
బెస్ట్ డైరెక్టర్
✦ షాన్ బేకర్- (అనోరా)
✦ బ్రాడీ కార్బెట్- (ది బ్రూటలిస్ట్)
✦ జేమ్స్ మ్యాన్‌గోల్డ్- (ది కంప్లీట్ అన్నోన్)
✦ జాక్వెస్ ఆడియార్డ్- (ఎమిలియా పెరెజ్)
✦ కార్లే ఫర్జెట్- (ది సబ్‌స్టాన్స్)






