OTT Movie: అదిరే ట్విస్టులతో ఓటీటీలో దుమ్మురేపుతోన్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ ప్లేస్‌లో దూసుకెళ్తోంది!

ప్రస్తుతం ఓటీటీ(OTT) ప్రపంచంలో ఆడియెన్స్ థ్రిల్, మిస్టరీ,(Thril Mistary) క్రైమ్‌(Crime)తో కూడిన కంటెంట్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలాంటి ఒక వెబ్ సిరీస్ ఓటీటీ ఆడియెన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమింగ్‌కు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ ‘మండల మర్డర్స్’(Mandala Murders) ఓ బ్లాక్‌బస్టర్ హిట్‌గా మారింది. జూలై 25(July 25)న విడుదలైన ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం టాప్ ట్రెండింగ్లో ఉంది.

ఈ సిరీస్‌లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్‌లు ఉండగా, ప్రతి ఎపిసోడ్ లోనూ ఉత్కంఠ రేపే సన్నివేశాలు, ఊహించని మలుపులు, ఉక్కిరిబిక్కిరి చేసే క్లైమాక్స్‌లతో కథ ముందుకు సాగుతుంది. వాణి కపూర్, సుర్వీన్ చావ్లా, వైభవ్ రాజ్ గుప్తా, శ్రియా పిల్గావ్‌కర్ వంటి నటులు ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు.

కథలోకి వెళితే…
ఈ సిరీస్ కథ 1952లో ఉత్తరప్రదేశ్‌లోని చరణ్‌దాస్‌పూర్ అనే ఊరిలో ప్రారంభమవుతుంది. అడవిలో నివసించే ఓ మంత్రగత్తె, తమ కోరికలు నెరవేరాలంటే బొటనవేలు సమర్పించాలని గ్రామస్థులను నమ్మిస్తుంది. ఆమె మాటలు నమ్మినవారు అలా చేస్తూ ఉంటారు. కానీ ఈ విషయాన్ని గమనించిన కొంతమంది మాత్రం ఆమెను ఊరి నుంచి తరిమేస్తారు.

ఈ నేపథ్యంలో కథలోకి ప్రవేశిస్తాడు విక్రమ్(Vikram), ఢిల్లీలో పోలీస్ ఆఫీసర్‌గా పనిచేసిన అతడు సస్పెండ్ అయి తిరిగి తన సొంత ఊరికి వస్తాడు. అక్కడికి వచ్చాక తన తల్లి అడవిలో అదృశ్యమైందని తెలుసుకుని వెతకడం ప్రారంభిస్తాడు. అదే సమయంలో గ్రామంలో వరుస హత్యలు జరుగుతాయి. ప్రతి మృతదేహంపై ప్రత్యేకమైన సింబల్స్ ఉండడం, హత్యల వెనుక ఓ అంతుచిక్కని మిస్టరీ ఉండడం… కథను మరింత ఆసక్తికరంగా మార్చుతుంది.

ఒక మహిళా CID అధికారి విచారణ కోసం అక్కడికి వస్తుంది. కానీ ఈ హత్యలకు గతంలో ఊరి నుంచి తరిమివేసిన మంత్రగత్తెకు సంబంధముందా? విక్రమ్ తల్లి ఏమైంది? ఈ హత్యల వెనుక నిజంగా ఎవరు ఉన్నారు? అన్నది పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ సిరీస్‌ను తప్పక చూడాల్సిందే.

టాప్‌లో ఎందుకుందంటే…
‘మండల మర్డర్స్’ ప్రేక్షకులను మొదటి ఎపిసోడ్ నుంచే ఆకట్టుకుంటుంది. సస్పెన్స్, హారర్, మిస్టరీ, ఇన్వెస్టిగేషన్ వంటి అంశాలు సమపాళ్లలో ఉండడంతో, ఇది ఒక మినీ థ్రిల్లింగ్ ఫెస్టివల్‌గా మారింది. ప్రతి ఎపిసోడ్ చివర ఉండే క్లైమాక్స్ ట్విస్టులు ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తున్నాయి.

ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌(Netflix)లో నంబర్ వన్ ట్రెండింగ్‌లో ఉన్న ఈ సిరీస్ గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. ప్రేక్షకులు ఇప్పటికే సీజన్ 2 కోసం ఎదురుచూస్తున్నారు. అయితే మేకర్స్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *