Pawan Kalyan: మళ్లీ సెట్‌లోకి పవర్ స్టార్.. ‘హరిహర వీరమల్లు’ కొత్తలుక్ రివీల్

పవర్ స్టార్ (Power Star).. ఈ పేరు విని చాలా రోజులు అవుతోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రాజకీయాల్లో(Politics)కి వచ్చిన తర్వాత జనసేనాని(Janasenani)గా, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంత్రి పదవి చెప్పట్టి డిప్యూటీ సీఎం(Deputy CM)గా కొనసాగుతున్నారు. దీంతో ఆయన సినిమాల్లో కనిపించే పేరు ప్రస్తుతం కనిపించడం లేదు. పైగా ఏడాది కిందటే సినిమాలన్నీ పక్కన పెట్టేశారు. మరోవైపు ఏపీలో ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర్నుంచి ఆయన్ని Dy CM అనే ట్యాగ్‌తోనే పిలుస్తున్నారు. కానీ ఇప్పుడు పవన్ మళ్లీ ‘పవర్ స్టార్’ అవతారం ఎత్తుతున్నాడు. రాజకీయాల కోసం పక్కన పెట్టేసిన సినిమాల(Pending Movies)ను ఒక్కొక్కటిగా పూర్తి చేయడానికి పవన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

షూటింగ్ చివరి దశలో హరిహర వీరమల్లు

ఇందులో పవన్ నటిస్తోన్న ‘హరిహర వీరమల్లు(Harihara Veeramallu)’ సినిమాని ఫస్ట్ పూర్తి చేయనున్నాడు పవన్. ఈ సినిమా చివరి దశ షూటింగ్‌(Shooting)లో పవన్ పాల్గొంటున్నట్లు ఈ చిత్ర బృందం శనివారం అధికారికంగా ప్రకటించింది. నిన్నటిదాకా కనిపించిన గెడ్డం లుక్‌లోనే పవన్ షూటింగ్‌కు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి 28న ‘హరిహర వీరమల్లు’ విడుదల కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే తన పెండింగ్ మూవీలను పట్టాలెక్కించే పనిలో పడ్డాడు పవన్. కాగా ఈ సినిమాను దర్శకుడు జ్యోతికృష్ణ(Director Jyotikrishna) డైరెక్ట్ చేస్తున్నారు.

ధర్మం కోసం పోరాటంలో ఆఖరి అధ్యాయం మొదలు

కాగా పవన్‌ కళ్యాణ్‌ హరిహర వీరమల్లు సినిమా సెట్‌లో పాల్గొన్న విషయాన్ని తెలియజేస్తూ టీమ్‌ కొత్త పోస్టర్‌(New poster)ని పంచుకుంది. సెట్‌లోని పవన్‌ లుక్‌ని విడుదల చేసింది. ధర్మం కోసం పోరాటంలో ఆఖరి అధ్యాయం మొదలు అని పేర్కొంది టీమ్‌. ఇదే సినిమాకి సంబంధించిన ఆఖరి షెడ్యూల్‌ అని తెలుస్తుంది. ఇందులో ఓ కొండపై నుంచి చూస్తున్నట్టుగా పవన్‌ లుక్‌ ఉంది. కాగా పవన్ మరో పెండింగ్ మూవీ ‘OG’ని కూడా త్వరగానే పూర్తి చేయాలని చూస్తున్నాడు. హరీశ్ శంకర్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagat Singh)’కు మాత్రం పవన్ ఇప్పట్లో డేట్లు ఇచ్చేలా కనిపించడం లేదు.

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *