Mana Enadu: దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో కాలుష్యం(Pollution) రోజురోజుకూ క్షీణిస్తోంది. దీంతో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. పీల్చేగాలి సైతం కాలుష్యం కావడంతో సర్వత్రా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు శీతాకాలం(Winter) ప్రవేశించడంతో పొగమంచు కమ్మేస్తోంది. ఓపైపు వాయు కాలుష్యం.. మరోవైపు పొగమంచు వెరసీ రాజధాని ప్రజల రోజువారీ జీవనంలో ఆటంకం కల్గిస్తున్నాయి. ముఖ్యంగా వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఉదయం, మధ్యాహ్నం వేళల్లోనే పరిస్థితి దారుణంగా ఉంటే.. ఇంక రాత్రి సమయంలో అయితే చెప్పనక్కర్లేదు. దీంతో అక్కడ వాయు నాణ్యత సూచీ(AQI) 400 దాటింది. పొగమంచు(Smog), వాయుకాలుష్యం(Pollution)తో విమాన సర్వీసులకు ఆటంకం కలిగింది.
సమీప దృశ్యాలు సైతం కనిపించని పరిస్థితి
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత దిగజారిపోయింది. అక్కడ దట్టమైన పొగమంచు అలముకుంది. దీంతో సమీపంలోని దృశ్యాలు కనిపించని పరిస్థితి నెలకొంది. పొగమంచు ఎఫెక్ట్ విమానాలపై కూడా పడింది. దాదాపు 300లకుపైగా విమాన సర్వీసులు(Flights Delayed At Delhi Airport) ఆలస్యమయ్యాయి. ఈ మేరకు ఫ్లైట్రాడర్ 24(Flightradar) సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ఢిల్లీకి రావాల్సిన 115 విమానాలు, అక్కడి నుంచి బయలుదేరాల్సిన 226 సర్వీసులకు అంతరాయం ఏర్పడినట్లు పేర్కొంది. కాగా పర్వతాల వద్ద మంచు కురుస్తుండటం వల్ల ఢిల్లీలో ఉష్ణోగ్రతలు తగ్గాయని(Temperatures have dropped in Delhi) తెలిపింది.
కాలుష్యంపై కలిసి పోరాడుదాం: ప్రియాంక
మరోవైపు ఢిల్లీ కాలుష్యంపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ(Priyanka Gandhi) కూడా స్పందించారు. కేరళ(Kerala)లోని ఢిల్లీకి తిరిగొచ్చాక.. అక్కడ గ్యాస్ ఛాంబర్లోకి ప్రవేశించినట్లుగా అనిపిస్తోందని అన్నారు. ఢిల్లీలో ఎప్పటికప్పుడు కాలుష్యం పెరుగుతూనే ఉందని.. ముఖ్యంగా పిల్లలు(Childrens), వృద్ధులు, శ్వాసకోస సమస్యల(Respiratory problems)తో బాధడుతున్నవారికి ఇది కష్టమైన పరిస్థితని తెలిపారు. రాష్ట్రంలో పరిశుభ్రమైన గాలి కోసం అందరూ కలిసి పార్టీలను దాటి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.








