గుజరాత్‌లోని అహ్మదాబాద్(Ahmadabad)లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం(Air India Plane Crash) ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. ఆ ఘోర దుర్ఘటనలో మొత్తం 279 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదం జరిగి వారం గడుస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో మృతదేహాల గుర్తింపు(identification of dead bodies) ప్రక్రియ పూర్తి కాలేదు. ఒక్కో మృతదేహాన్ని గుర్తించేందుకు ఫోరెన్సిక్ వైద్యుల(Forensic doctors)కు దాదాపు 24 గంటలు పడుతోంది. దీంతో డెడ్ బాడీల గుర్తింపు ఆలస్యమవుతోందని అధికారులు తెలిపారు.

DNA టెస్టు ద్వారా కొనసాగుతున్న గుర్తింపు ప్రక్రియ
కాగా కాసేపటి క్రితం కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఎయిరిండియా ప్రమాదం(Air India accident)లో మరణించిన వారిలో 202 మందిని DNA టెస్టు ద్వారా గుర్తించినట్లు తెలిపింది. ఇందులో ఇప్పటి వరకు 157 మంది మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు. మరో 33 మంది మృతుల గుర్తింపు, వారి మృతదేహాల అప్పగింత ప్రక్రియ వివిధ దశల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఐదుగురి DNA పరీక్షలు ఇంకా జరుగుతున్నాయని చెప్పింది. 15 మృతదేహాల గుర్తింపు కోసం కుటుంబ సభ్యుల నుంచి అదనపు నమూనాలు సేకరించాల్సి ఉన్నదని ఫోరెన్సిక్ వైద్యులు తెలిపారు.
Air India Plane Crash: 202 Victims Identified, 124 Bodies Handed Over To Families – By @aishvaryjain https://t.co/batJPWiWif pic.twitter.com/zkTMK1EEc8
— NDTV (@ndtv) June 18, 2025
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారిలో ఇద్దరు విదేశీయుల మృతదేహాలను వారి దేశాలకు పంపించారు. 11 మృతదేహాలను గుజరాత్ బయట ఉన్న ఇతర రాష్ట్రాలకు తరలించారు. డీఎన్‌ఏ టెస్ట్(DNA Test) ద్వారా గుర్తించిన 202 మృతదేహాల్లో ఎక్కువగా రోడ్డు మార్గం ద్వారా గుజరాత్‌లోని పలు ప్రాంతాలకు అంబులెన్స్‌లో తరలించినట్లు అధికారులు తెలిపారు.







