
వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను (Padma Awards 2025) ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం (Republic Day celebrations) సందర్భంగా తాజాగా ఈ పురస్కారాలకు ఎంపికైన వారి జాబితాను వెల్లడించింది. ఇందులో ఏడుగురిని పద్మ విభూషణ్, 19 మందిని పద్మ భూషణ్, 113 మందిని పద్మ శ్రీ పురస్కారాలు వరించాయి.
తెలుగు పద్మాలు వీరే
ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పలువురిని పద్మ పురస్కారాలు వరించాయి. వీరిలో తెలంగాణకు చెందిన దువ్వూరి నాగేశ్వర్రెడ్డి (వైద్యం)కి పద్మ విభూషణ్ వరించింది. మరోవైపు మందకృష్ణ మాదిగ (ప్రజా వ్యవహారాలు) పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఏపీ నుంచి కళల విభాగంలో నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ ప్రకటించారు.
పద్మ పురస్కారాలు పొందిన తెలుగు వారు వీరే..
- దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి (వైద్యం) – పద్మభూషణ్ (Telangana)
- మందకృష్ణ మాదిగ (ప్రజా వ్యవహారాలు) – పద్మశ్రీ (తెలంగాణ)
- నందమూరి బాలకృష్ణ (కళలు) – పద్మభూషణ్ (AP)
- కేఎల్ కృష్ణ (సాహిత్యం) – పద్మశ్రీ (ఏపీ)
- మాడుగుల నాగఫణి శర్మ (కళలు) – పద్మశ్రీ (ఏపీ)
- మిర్యాల అప్పారావ్ (కళలు) – పద్మశ్రీ (ఏపీ)
- వద్దిరాజు రాఘవేంద్రాచార్య (సాహిత్యం) – పద్మశ్రీ (ఏపీ)