
గణతంత్ర దినోత్సవాన్ని(Republic Day 2025) పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుల(Padma Awards)ను ప్రకటించింది. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో పద్మ అవార్డులు మూడు విభాగాలలో ప్రదానం చేస్తారు. పద్మవిభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ. కళ, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్, ఇంజినీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, పౌర సేవ వంటి విభిన్న రంగాలలో అత్యుత్తమ ప్రతిభను ఈ అవార్డుతో కేంద్రం సత్కరిస్తుంది. రిపబ్లిక్ డే(Republic Day) సందర్భంగా రేపు భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Draupadi Murmu) ఈ అవార్డులు అందజేస్తారు. కాగా ఈ ఏడాది వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 30 మందికి పద్మ అవార్డులు అందజేయనున్నారు. నటి వైజయంతి మాల, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah Naidu) పద్మవిభూషణ్‌కు ఎంపిక కాగా.. మిథున్ చక్రవర్తి, ఉషా ఉతుప్‌లను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించనున్నారు.
పద్మశ్రీ పురస్కార గ్రహీతలు వీరే..
☛ జోనస్ మాశెట్టి (వేదాంత గురు) – బ్రెజిల్
☛ హర్వీందర్‌సింగ్ (పారాలింపియన్ గోల్డ్‌మెడల్ విన్నర్) – హరియాణా
☛ భీమ్ సింగ్ భవేష్ (సోషల్‌వర్క్) – బిహార్
☛ పి.దక్షిణా మూర్తి (డోలు విద్వాంసుడు) – పుదుచ్చేరి
☛ ఎల్.హంగ్‌థింగ్ (వ్యవసాయం-పండ్లు) – నాగాలాండ్
☛ బేరు సింగ్ చౌహాన్ (జానపద గాయకుడు) – మధ్యప్రదేశ్
☛ షేఖా ఎ.జె. అల్ సబాహ్ (యోగా) – కువైట్
☛ నరేన్ గురుంగ్ (జానపద గాయకుడు) – నేపాల్
☛ హరిమన్ శర్మ (యాపిల్ సాగుదారు) – హిమాచల్‌ప్రదేశ్
☛ జుమ్దే యోమ్‌గామ్ గామ్లిన్ (సామాజిక కార్యకర్త) – అరుణాచల్‌ప్రదేశ్
☛ విలాస్ దాంగ్రే (హోమియోపతి వైద్యుడు) – మహారాష్ట్ర
☛ వెంకప్ప అంబానీ సుగటేకర్ (జానపద గాయకుడు) – కర్ణాటక
☛ నిర్మలా దేవి (చేతి వృత్తులు) – బిహార్
☛ జోయ్నచరణ్ బతారీ (థింసా కళాకారుడు) – అస్సాం
☛ సురేశ్ సోనీ (సోషల్‌వర్క్- పేదల వైద్యుడు) – గుజరాత్
☛ రాధా బహిన్ భట్ (సామాజిక కార్యకర్త) – ఉత్తరాఖండ్
☛ పాండి రామ్ మాండవి (కళాకారుడు) – ఛత్తీస్‌గఢ్
☛ భీమవ్వ దొడ్డబాలప్ప శిల్లేక్యాతర (తోలుబొమ్మలాట) – కర్ణాటక
☛ పర్మార్ లావ్జీభాయ్ నాగ్జీభాయ్ (చేనేత) – గుజరాత్
☛ విజయలక్ష్మి దేశ్‌మానే (వైద్యం) – కర్ణాటక
☛ చైత్రం దేవ్‌చంద్ పవార్ (పర్యావరణ పరిరక్షణ) – మహారాష్ట్ర
☛ జగదీశ్ జోషిలా (సాహిత్యం) – మధ్యప్రదేశ్
☛ నీర్జా భట్లా (గైనకాలజీ) – ఢిల్లీ
☛ హ్యూ, కొల్లీన్ గాంట్జర్ (సాహిత్యం, విద్య -ట్రావెల్) – ఉత్తరాఖండ్
☛ లిబియా లోబో సర్దేశాయ్ (స్వాతంత్ర్య సమరయోధురాలు) – గోవా
☛ గోకుల్ చంద్ర దాస్ (కళలు) – బంగాల్
☛ సాల్లీ హోల్కర్ (చేనేత) – మధ్యప్రదేశ్
☛ మారుతీ భుజరంగ్‌రావు చిటమ్‌పల్లి (సాంస్కృతికం, విద్య) – మహారాష్ట్ర
☛ బతూల్ బేగమ్ (జానపద కళాకారిణి) – రాజస్థాన్
☛ వేలు ఆసన్ (డప్పు వాద్యకారుడు) – తమిళనాడు
Padma Awards 2025 | Unsung and unique Padma Awardees. Full list to be released shortly.
Dr Neerja Bhatla, a Gynaecologist from Delhi with specialized focus on cervical cancer detection, prevention and management being awarded Padma Shri.
Bhim Singh Bhavesh, social worker from… pic.twitter.com/tIkPS8Pzln
— ANI (@ANI) January 25, 2025