Mukesh Ambani గొప్ప మనసు.. ఉగ్రదాడి క్షతగాత్రులకు ఉచిత వైద్యం

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం(Pahalgam) వద్ద ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి(Terror Attack) ఘటనపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ(Mukesh Ambani) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ పాశవిక చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల దాడిలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం పట్ల విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

భారత ప్రభుత్వానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం..

ఉగ్రవాదం అనేది మానవాళికి పెను ముప్పు అని, అది ఏ రూపంలో ఉన్నా సహించరాదని అన్నారు. ఇలాంటి అమానవీయ చర్యలకు పాల్పడే వారిని ఉపేక్షించకూడదన్నారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేందుకు భారత ప్రభుత్వం, PM మోదీ చేస్తున్న కృషికి రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries) ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Image

ఉచితంగా అత్యున్నత వైద్య సేవలు 

ఈ సందర్భంగా ఉగ్రదాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ముకేశ్ అంబానీ ఆకాంక్షించారు. అంతేకాకుండా, ఈ దాడిలో గాయపడిన వారికి అండగా నిలుస్తూ కీలక ప్రకటన చేశారు. క్షతగాత్రులకు అవసరమైన అత్యున్నత వైద్య సేవల(Top-notch medical services)ను ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్‌కు చెందిన సర్ హరికిషన్ దాస్ నరోత్తమ్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌(Sir Harikishan Das Narottam Reliance Foundation Hospital)లో పూర్తిగా ఉచితం(Free)గా అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Related Posts

Racist Attack on Indian Girl: భారత సంతతి బాలికపై ఐర్లాండ్‌లో అమానుష ఘటన

ఐర్లాండ్‌(Ireland)లో అత్యంత అమానుష రీతిలో జాత్యాహంకార దాడి(Racist attack) జరిగింది. ఇక్కడి వాటర్‌ఫోర్డ్‌లో ఆరేండ్ల భారతీయ సంతతి బాలిక(Indian origin Girl) తన ఇంటి ముందు ఆటుకుంటూ ఉండగా కొందరు అబ్బాయిలు సైకిళ్లపై వచ్చి దాడి జరిపారు. తిట్లకు దిగి, ఐర్లాండ్…

Nitish Kumar: వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలిస్తాం.. సీఎం కీలక ప్రకటన

అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) సమీపిస్తుండటంతో బిహార్(Bihar) సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా నిరుద్యోగులే టార్గెట్‌గా ప్రచారం చేపట్టారు. ఈ మేరకు యువతను ఆకట్టుకునేందుకు X వేదికగా కీలక ప్రకటన చేశారు. 2025-2030…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *