Ban on Pakistani Celebrities: ఇండియాలో పాకిస్థాన్ సెలబ్రిటీలపై మళ్లీ నిషేధం

పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు(Tensions with Pakistan), కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ ‘ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)’ చేపట్టిన తర్వాత పలువురు ప్రముఖ పాకిస్థానీ సెలబ్రిటీల(Pakistani celebrities) సోషల్ మీడియా ఖాతాలపై భారత్ నిషేధం(Ban) విధించిన సంగతి తెలిసిందే. అయితే నిన్న ఉన్నట్టుండి వాటిపై బ్యాన్ తొలగించారు. అయితే దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఈ నిషేధాన్ని ఈరోజు (జులై 3) మళ్లీ పునరుద్ధరించారు. నిషేధాన్ని ఎత్తివేసి 24 గంటలు కూడా గడువకముందే మళ్లీ నిషేధం విధించడం గమనార్హం. దీంతో ఈ ఉదయం నాటికి క్రికెటర్ షాహిద్ అఫ్రీదితో పాటు నటీనటులు ఫవాద్ ఖాన్, మావ్రా హోకేన్, యుమ్నా జైదీ, హనియా ఆమిర్ వంటి వారి ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ ఖాతా ప్రొఫైళ్లు ఇండియన్ యూజర్లకు అందుబాటులో లేకుండా పోయాయి.

ఆ ఆనందం వారికి ఎక్కువసేపు నిలవలేదు

నిన్న అనేక పాకిస్థానీ యూట్యూబ్ ఛానెళ్లు(Pakistani YouTube channels), ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు ఒక్కసారిగా ఇండియా(India)లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో పాక్ సెలబ్రిటీల SMలపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, ఈ ఆనందం అభిమానులకు ఎక్కువసేపు నిలవలేదు. మరుసటి రోజే ఖాతాలు మళ్లీ మాయమవడంతో గందరగోళం నెలకొంది.

Ban on several Pak news websites and social media accounts of celebrities, imposed during Op Sindoor, reversed - India Today

పాకిస్థానీ సెలబ్రిటీల ప్రొఫైళ్లను వెతికితే చర్యలు

ఎవరైనా భారతీయ యూజర్లు పాకిస్థానీ సెలబ్రిటీల ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైళ్లను వెతికితే “చట్టపరమైన అభ్యర్థనకు అనుగుణంగా ఈ కంటెంట్‌ను పరిమితం చేశాం. అందువల్ల ఈ ఖాతా భారతదేశంలో అందుబాటులో లేదు” అనే సందేశం కనిపిస్తోంది. దీన్నిబట్టి సోషల్ మీడియా సంస్థలు ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ చర్యలు తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వారి సోషల్ మీడియా ఖాతాలను భౌగోళికంగా భారత్‌లో నిరోధించే (Geo blocking) చర్యలు చేపట్టింది.

Related Posts

Racist Attack on Indian Girl: భారత సంతతి బాలికపై ఐర్లాండ్‌లో అమానుష ఘటన

ఐర్లాండ్‌(Ireland)లో అత్యంత అమానుష రీతిలో జాత్యాహంకార దాడి(Racist attack) జరిగింది. ఇక్కడి వాటర్‌ఫోర్డ్‌లో ఆరేండ్ల భారతీయ సంతతి బాలిక(Indian origin Girl) తన ఇంటి ముందు ఆటుకుంటూ ఉండగా కొందరు అబ్బాయిలు సైకిళ్లపై వచ్చి దాడి జరిపారు. తిట్లకు దిగి, ఐర్లాండ్…

Nitish Kumar: వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలిస్తాం.. సీఎం కీలక ప్రకటన

అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) సమీపిస్తుండటంతో బిహార్(Bihar) సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా నిరుద్యోగులే టార్గెట్‌గా ప్రచారం చేపట్టారు. ఈ మేరకు యువతను ఆకట్టుకునేందుకు X వేదికగా కీలక ప్రకటన చేశారు. 2025-2030…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *