India-Pak War: భారత్ ఎయిర్ స్ట్రైక్స్.. షరీఫ్ సర్కార్‌పై  పాక్ ఎంపీల ఆగ్రహం

ఓవైపు భారత్ నుంచి దాడుల భయంతో పాకిస్థాన్(Pakistan) ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మరోవైపు స్వదేశంలోనూ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇటు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, అటు ఇమ్రాన్ ఖాన్ పార్టీ PTI కార్యకర్తల నిరసనలు ప్రభుత్వాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ తరుణంలో పాకిస్థాన్ ఎంపీ షాహిద్ అహ్మద్(Pakistani MP Shahid Ahmed), ప్రధాని షెహబాజ్ షరీఫ్‌(Pak PM Shehbaz Sharif)పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. షెహబాజ్‌ను ‘పిరికివాడి’గా అభివర్ణించిన ఆయన, భారత ప్రధాని నరేంద్ర మోదీ(India PM Modi) పేరును ప్రస్తావించడానికి కూడా తమ ప్రధాని భయపడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు.

మోదీ పేరును కూడా ఉచ్చరించలేకపోతున్నారు..

కాగా సరిహద్దుల్లో సైనికులు(Soldiers) ధైర్యం కోరుకుంటున్నారని, కానీ PM స్వయంగా పిరికివాడై, మోదీ పేరును కూడా ఉచ్చరించలేకపోతే, ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న వారికి ఎలాంటి సందేశం పంపుతున్నామని షాహిద్ అహ్మద్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన టిప్పు సుల్తాన్(Tipu Sultan) చెప్పిన ఓ సూక్తిని ఉటంకించారు. “సింహాల సైన్యాన్ని నక్క నడిపిస్తే, వారు పోరాడలేరు, యుద్ధంలో ఓడిపోతారు” అని షాహిద్ అహ్మద్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు పాకిస్థాన్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

కాపాడాలంటూ కన్నీళ్లు పెట్టుకున్న మరో ఎంపీ

ఇటీవల, మరో ఎంపీ తాహిర్ ఇక్బాల్(MP Tahir Iqbal) కన్నీళ్లు పెట్టుకుని, “యా ఖుదా, ఆజ్ బచా లో” (ఈ భారత్ మమ్మల్ని వదిలేలా లేదు… దేవుడా, ఈ రోజు మమ్మల్ని రక్షించు) అని ప్రార్థిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్(Viral) అయింది. దేశంలో నెలకొన్న అశాంతి, భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో ఆయన దేవుడిని వేడుకున్నారు.

Related Posts

Racist Attack on Indian Girl: భారత సంతతి బాలికపై ఐర్లాండ్‌లో అమానుష ఘటన

ఐర్లాండ్‌(Ireland)లో అత్యంత అమానుష రీతిలో జాత్యాహంకార దాడి(Racist attack) జరిగింది. ఇక్కడి వాటర్‌ఫోర్డ్‌లో ఆరేండ్ల భారతీయ సంతతి బాలిక(Indian origin Girl) తన ఇంటి ముందు ఆటుకుంటూ ఉండగా కొందరు అబ్బాయిలు సైకిళ్లపై వచ్చి దాడి జరిపారు. తిట్లకు దిగి, ఐర్లాండ్…

Nitish Kumar: వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలిస్తాం.. సీఎం కీలక ప్రకటన

అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) సమీపిస్తుండటంతో బిహార్(Bihar) సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా నిరుద్యోగులే టార్గెట్‌గా ప్రచారం చేపట్టారు. ఈ మేరకు యువతను ఆకట్టుకునేందుకు X వేదికగా కీలక ప్రకటన చేశారు. 2025-2030…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *