
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు(Parliaments Budget Sessions) నేటి (జనవరి 31) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇవాళ ఉదయం 11 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Draupadi Murmu) ప్రసంగించనున్నారు. ఆ తర్వాత రేపు (ఫిబ్రవరి 1) 2025-26 ఏడాదికి గాను బడ్జెట్‌ను ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ప్రవేశ పెట్టనున్నారు. కాగా ఈసారి జనవరి 31 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండు విడతల్లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించున్నారు. తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 13న ముగుస్తాయి. ఈ సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు(Waqf Board Amendment Bill), బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు, రైల్వే సవరణ బిల్లు, విపత్తు నిర్వహణ సవరణ బిల్లుతో పాటు వలస, విదేశీయుల బిల్లులు ఈసారి కీలకం కానున్నాయి. ఇక రెండో విడతగా మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు సమావేశాలు జరుగుతాయి.
మొత్తం 62 బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం
ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే వక్ఫ్ సవరణ బిల్లు(Waqf Board Amendment Bill)ను ఈ బడ్జెట్ సమావేశాల్లో మోదీ(PM Modi) గవర్నమెంట్ పార్లమెంట్ కు తీసుకురాబోతున్నట్టు అఖిల పక్ష సమావేశం(All Party Meeting)లో వెల్లడించింది. ఈ సెషన్‌లో ప్రవేశ పెట్టే బిల్లులు లిస్ట్‌ను కేంద్ర సర్కార్ అఖిల పక్షానికి అందజేసింది. ఇందులో వక్ఫ్ సవరణ బిల్లు కూడా ఉంది. మొత్తంగా 62 బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. అందులో 16 కీలక బిల్లులను ఈ సమావేశాల్లో ఆమోదించేలా కేంద్ర ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు మహాకుంభమేళాలో తొక్కిసలాట(Mahakumbh Mela Stampede) అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని విపక్షాలు నిర్ణయించాయి. అయితే, ఏయే అంశాలపై చర్చించాలనేది BAC సమావేశంలో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు(Kiran Rijiju) ప్రకటించారు.